ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇది ఇతరులను కలిసినప్పుడు.. వారికి ఈ వైరస్ ఉంటే.. వారి నుంచి వ్యాపిస్తుంది. దీనికి నివారణ కొద్ది రోజుల వరకు ఇతరులకు దూరంగా ఉండటమే. అయితే ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కోసం.. ఇప్పటికే చాలా మంది పాటలు రాసి.. పాడారు. అయితే తాను కూడా కరోనా వైరస్ పైన పాట రాసి, పాడానని.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘కరోనా వైరస్ పైన నేనే రాసి, పాడిన ‘కనిపించని పురుగు’ అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను. చేతులు కడుక్కొని వినండి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఏప్రిల్ ఫూల్ సందర్భంగా ఈ ట్వీట్ చేసి ఉంటారని.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనాపై పోరాడదామంటూ చిరంజీవి, నాగార్జున సహా టాలీవుడ్ ప్రముఖులు ‘లెటజ్ ఫైట్ కరోనా’ అంటూ ఓ వీడియో సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను…చేతులు కడుక్కొని వినండి.
— Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2020
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి