Breaking: లాక్‌డౌన్‌ పొడిగించిన ఒడిశా.. ఎప్పటి వరకు అంటే..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 15వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే కరోనా విస్తరణ ఇంకా కంట్రోల్‌లోకి రావడం లేదు. రోజురోజుకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

Breaking: లాక్‌డౌన్‌ పొడిగించిన ఒడిశా.. ఎప్పటి వరకు అంటే..!
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 1:19 PM

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 15వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే కరోనా విస్తరణ ఇంకా కంట్రోల్‌లోకి రావడం లేదు. రోజురోజుకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను పొడిగింపును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని ప్రధాని మోదీ సైతం పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆలోపే తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు.

ఏప్రిల్ 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించిన నవీన్‌ పట్నాయక్‌.. ఏప్రిల్ 30వరకు అన్ని రైల్వే, ఎయిర్‌లైన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న పరిస్థితులను అర్థం చేసుకొని లాక్‌డౌన్‌ సమయంలో మాకు సహకరిస్తోన్న 4.5కోట్ల ఒడిశా ప్రజలకు ధన్యవాదాలు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు మనకు లాక్‌డౌన్‌ కంటే వేరే మార్గం లేదు. మార్చి 15న మొదటి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 42 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ మధ్య యుద్దం జరుగుతుంటుంది. కానీ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విఙ్ఞప్తి చేస్తున్నాము అని వెల్లడించారు.

Read This Story Also: సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. వాట్సాప్‌లో భార్యకు వీడియోలు..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో