తెలంగాణలో నమోదైన తాజా కేసుల వివరాలు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ రోజు కేసులు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. తాజాగా మొన్నటి వరకు వరుసగా సింగిల్ డిజిట్‌కు పరిమితమైన కేసులు.. గురువారం సడన్‌గా పెరిగాయి. ఇక ఇవాళ శుక్రవారం రోజు మళ్లీ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. శుక్రవారం తెలంగాణ […]

తెలంగాణలో నమోదైన తాజా కేసుల వివరాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 9:57 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ రోజు కేసులు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. తాజాగా మొన్నటి వరకు వరుసగా సింగిల్ డిజిట్‌కు పరిమితమైన కేసులు.. గురువారం సడన్‌గా పెరిగాయి. ఇక ఇవాళ శుక్రవారం రోజు మళ్లీ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. శుక్రవారం తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. శుక్రవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఇక శుక్రవారం రోజు కరోనా నుంచి కోలుకుని.. 22 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 464 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 552 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.