దేశ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం.. తాజా వివరాలు ఇవే…

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే ముప్పై లక్షల మందికిపైగా కరోనా సోకగా.. రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక వీరిలో పది లక్షల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ […]

Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 9:37 PM

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే ముప్పై లక్షల మందికిపైగా కరోనా సోకగా.. రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక వీరిలో పది లక్షల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24గంటల్లో తాజాగా మరో 1755 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక కరోనా బారినపడి 77 మంది మృతిచెందినట్లు అధికారులు స్పష్టం చేశారు.

శుక్రవారం సాయంత్రం 5.00 గంటల వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 35,365కి చేరింది. వీరిలో 9065 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 1152 మంది ప్రాణాలు విడిచారు. కాగా.. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 10498 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో1773 మంది కరోనా నుంచి జయించగా.. 459 మంది ప్రాణాలు కోల్పోయారు.