తమిళనాడులో విజృంభిస్తోన్న మహమ్మారి.. వరుసగా రెండో రోజు కూడా..

దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పది వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో రెండు రోజుల్లోనే వెయ్యి కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. సోమవారం ఐదు వందలకు పైగా కేసులు నమోదు కాగా.. మంగళ వారం కూడా ఐదు వందల డిజిట్‌ దాటింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా […]

తమిళనాడులో విజృంభిస్తోన్న మహమ్మారి.. వరుసగా రెండో రోజు కూడా..
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 9:21 PM

దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పది వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో రెండు రోజుల్లోనే వెయ్యి కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. సోమవారం ఐదు వందలకు పైగా కేసులు నమోదు కాగా.. మంగళ వారం కూడా ఐదు వందల డిజిట్‌ దాటింది.

మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 508 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో చెన్నైలోనే 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4058కు చేరగా..చెన్నైలోకరోనా పాజిటివ్ కేసులు మొత్తం సంఖ్య 2008కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు ఇద్దరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం కరోనాను కట్టడి చేసేందుకు మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.