కొత్త కేసులు నమోదైనప్పటకీ.. ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. రీజన్ ఇదే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్తగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు.. బాధితులు కోలుకోవడం జరుగుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా మంగళవారం కేరళ రాష్ట్రంలో మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ […]

కొత్త కేసులు నమోదైనప్పటకీ.. ఊపిరి పీల్చుకుంటున్న కేరళ.. రీజన్ ఇదే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 9:22 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్తగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు.. బాధితులు కోలుకోవడం జరుగుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా మంగళవారం కేరళ రాష్ట్రంలో మూడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 37 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత రెండు రోజుల పాటు కరోనా కేసులు నమోదవ్వలేదని పేర్కొన్నారు. ఇవాళ మాత్రం మూడు కేసులు నమోదయ్యాయన్నారు. అయితే కొత్తగా నమోదైన మూడు కేసులు కూడా వయనాడ్‌లోనే నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కొత్తగా కేసులు నమోదవ్వడంతో.. కేరళ సర్కార్ అప్రమత్తమైంది. మరింత కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు విధించి.. త్వరలోనే కేరళలో కరోనా విముక్తి రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది పినరయ్ సర్కార్.