‘మందు రేటు పెరిగిందా ? డోంట్ వర్రీ ! తాగి తీరుతాం’

మందు రేటు విపరీతంగా పెరిగినా తామేమీ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఎంత ఖర్చయినా కిక్కునిచ్ఛే మందు బాటిల్స్ కొని తీరుతామని అంటున్నారు మందు బాబులు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా మందు షాపుల వద్ద వీరు బారులు తీరి నిలబడ్డారు. ఎండ పెరుగుతున్నా వీరి ‘పట్టుదల’ సడలలేదు. తాము తెల్లవారు జామున 4 గంటల నుంచే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని, నిన్న షాపులు మూసివేసిన ఫలితంగా ఎంతో నిరాశ చెందామని ఈ లిక్కర్ రాయుళ్లు […]

  • Umakanth Rao
  • Publish Date - 8:39 pm, Tue, 5 May 20
'మందు రేటు పెరిగిందా ? డోంట్ వర్రీ ! తాగి తీరుతాం'

మందు రేటు విపరీతంగా పెరిగినా తామేమీ వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ఎంత ఖర్చయినా కిక్కునిచ్ఛే మందు బాటిల్స్ కొని తీరుతామని అంటున్నారు మందు బాబులు. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా మందు షాపుల వద్ద వీరు బారులు తీరి నిలబడ్డారు. ఎండ పెరుగుతున్నా వీరి ‘పట్టుదల’ సడలలేదు. తాము తెల్లవారు జామున 4 గంటల నుంచే ఇక్కడ వెయిట్ చేస్తున్నామని, నిన్న షాపులు మూసివేసిన ఫలితంగా ఎంతో నిరాశ చెందామని ఈ లిక్కర్ రాయుళ్లు తెలిపారు. సామాజిక దూరమన్న ప్రసక్తే లేదు. దాదాపు ఒక మైలు  దూరం వరకూ అలాగే నిలబడ్డారు చాలామంది. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో గుమికూడిన మందుబాబులను చెదర గొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. రాత్రి 7 గంటల వరకు కూడా మద్యం అమ్మకాలు సాగాయి.