AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిక్కోలులో తొలి కరోనా మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. బుధవారం ఏకంగా కోవిడ్ పాజిటివ్ కేసులు మూడు సెంచరీలు దాటేశాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు మంద‌స ప‌ట్ట‌ణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.

సిక్కోలులో తొలి కరోనా మరణం
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2020 | 4:20 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. బుధవారం ఏకంగా కోవిడ్ పాజిటివ్ కేసులు మూడు సెంచరీలు దాటేశాయి. మొత్తం 15,188 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 351 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 275 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఏపీలో మొత్తం 7,071కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. 90 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే, శ్రీకాకుళం జిల్లాలోనూ తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ అధికారులు మంద‌స ప‌ట్ట‌ణాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.

శ్రీకాకుళం జిల్లా మందసం మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 37 ఏళ్ల యువకుడు బుధవారం మృతిచెందినట్లు జిల్లా క‌లెక్ట‌‌ర్ జె.నివాస్ వెల్లడించారు. కరోనా మృతి కారణంగా ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాగా, మ‌ర‌ణించిన వ్య‌క్తికి ఎలాంటి ట్రావెల్ హిస్ట‌రీ లేనప్పటికీ,…. కేవలం సంక్ర‌మ‌ణ ద్వారానే అత‌డికి క‌రోనా వ్యాపించిందని అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 400 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు తెలిపారు. ఇందులో 271 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో కేసుల దృష్ట్యా ఒక్క శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోనే 10 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కరోనా కేసుల గుర్తింపు కోసం చేస్తున్న టెస్టుల సంఖ్యను మరింత పెంచింది. గడిచిన 24 గంటల్లో 15,188 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 5,98,474 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 5555 కేసులు నమోదు కాగా, దీనికి అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1253 మంది కరోనా బారినపడ్డారు.

Follow Us
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
ఆగస్టు నుంచి కొత్త రూల్స్.. కేవైసీ కోసం డాక్యుమెంట్స్ అవసరం లేదు.
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
రూ. 10 కోట్లతో పాటు ఆ స్టార్ ఆల్‌రౌండర్ బలి?
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
నా పొట్ట కొట్టారు.. జబర్దస్త్ చంటి..
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు.. మైండ్‌ను కాపాడుకునే 9 బంగారు సూత్రాలు
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష్ణుమూర్తి కొలువై
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
కారు కొనాడానికే సినిమాల్లోకి వచ్చా.. టాలీవుడ్ హీరోయిన్..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
ఎస్ఐఆర్‌లో మీ ఓటు కోల్పోయారా..? మళ్లీ ఓటు పొందాలంటే ఇలా చేయండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
తొలి ఏకాదశి స్పెషల్.. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన పేలపిండి..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..
ఎన్టీఆర్ సినిమాలో ఆ సీన్ తీయకుండా ఉండాల్సింది..