దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..
Coronavirus Effect: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కళకళలాడే సినిమా ఇండస్ట్రీ ఈ మహమ్మారి కారణంగా కుదేలైపోయింది. ఎప్పటికప్పుడూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోలు స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నారు. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు క్లోజ్ చేయడం, రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో సినిమా ఇండస్ట్రీ కోట్లలో నష్టపోయింది. ఇక దేశవ్యాప్తంగా అమలైన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. దీని తర్వాత అయినా […]
Coronavirus Effect: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కళకళలాడే సినిమా ఇండస్ట్రీ ఈ మహమ్మారి కారణంగా కుదేలైపోయింది. ఎప్పటికప్పుడూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోలు స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నారు. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు క్లోజ్ చేయడం, రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో సినిమా ఇండస్ట్రీ కోట్లలో నష్టపోయింది. ఇక దేశవ్యాప్తంగా అమలైన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. దీని తర్వాత అయినా సినీ పరిశ్రమ వెంటనే పుంజుకుంటుందా.? అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
కరోనా వైరస్ జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే తీవ్రంగా ఉంటుంది. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను సామాజిక దూరాన్ని పాటించమని చెబుతున్నాయి. దీనితో ఏప్రిల్ 14 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్సులకు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకవేళ అనుమతిచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అటు దేశంలో ఉన్న చాలా సింగల్ స్క్రీన్ థియేటర్లలో సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో థియేటర్లకు, షూటింగులకు ఏప్రిల్ 14న పర్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదని.. మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు వరుసగా ఐదారు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్దంగా ఉండటంతో.. ఎవరు.? ఎప్పుడు.? రిలీజ్ చేయాలన్న దానిపై దర్శక నిర్మాతలు తర్జనబర్జనలు పడుతున్నారు. అటు కొన్ని సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయాలనీ కూడా పరిశ్రమ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మొదట లాక్ డౌన్ పై స్పష్టత రావాలి.
ఇవి చదవండి:
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..
దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..
వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం
మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..
వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..
ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..
కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..