Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 38 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 138845. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 77103. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 57721. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4021. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం. రేపు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.
  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నుంచి 28 విమానాల రాకపోకలు . వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న 12 విమానాలు . హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన 16 ఫ్లైట్స్ . ఈ రోజు షెడ్యూల్ ప్రకారం 39 విమాన సర్వీసులు . 20 డిపచర్స్.. 19 అరెవల్స్ గా ప్రకటించిన ఎయిర్ పోర్టు అథారటీ . 3000 వేల వరకు వస్తారని అంచనా.
  • వరంగల్: తొమ్మిది మందిని హత్య చేసిన హంతకుడు ఒక్కడే.. సంజయ్ కుమార్ యాదవ్. నిషా సోదరి రఫీకా హత్యను కప్పిపూడ్చుకోవడం కోసం ఈ తొమ్మిది హత్యలు చేశాడు. సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితున్ని గుర్తించాము. 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్డకొడుకు జన్మదిన వేడుకలరోజు తన మర్డర్ స్కెచ్ కు వేదికగా మార్చుకున్నాడు. వారు తినే అన్నంలో నిద్రమాత్రలు పొడిచేసి కలిపాడు... వారంతా మత్తులోకి జారుకున్న తర్వాత గోనెసంచిలో ఈడ్చుకెళ్ళి బావిలో పడేశాడు. ఈ హత్యలన్నీ అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 5గంటల సమయంలో జరిగాయి. ప్రిస్కిప్షన్ లేకుండా ఇన్ని స్లీపింగ్ పిల్స్ అమ్మిన మెడికల్ షాపులపై చర్యలు తీసుకునేలా డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు సిఫారసు చేశాము. వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాధ్ రవీందర్.
  • వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజీలు పంపుతున్నాడు అని ట్రాఫిక్ హోంగార్డు పై షీ టీమ్ కు ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు లాక్‌డౌన్‌ సమయములో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ . కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టిన హోంగార్డ్ వెంకటేష్ . వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు . మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సీపీ అంజనీ కుమార్ . హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేసిన సిపిఐ అంజనీ కుమార్.
  • కరోనా తెలంగాణా బులిటిన్ ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు ఇవ్వాళ నలుగురు మృతి మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.. ఇవ్వాళ 24 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

Coronavirus Outbreak, ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

Coronavirus Outbreak: ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్‌ 14కు లాక్‌డౌన్‌ ముగుస్తుందా? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. మనకంటే ముందే స్టే ఎట్‌ హోమ్‌ను ప్రకటించిన దేశాలు ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. అక్కడ కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ తప్పడం లేదు. ఇక మన దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,072కు చేరింది. మరణాలు కూడా 77కు చేరింది. వేలాది మంది ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. రోజుకు వందల మందికి కరోనా పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

అయితే లాక్‌డౌన్‌ను కొనసాగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు అధికారులు. 14తో లాక్‌డౌన్‌ ముగుస్తుందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా సంకేతాలు మాత్రం ఇచ్చారు. రాష్ట్రాలు కూడా అందుకు సంసిద్ధమవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పితే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని, ప్రస్తుతానికైతే కొనసాగించే అవకాశాలు లేవంటున్నారు అధికారులు.

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ తర్వాత కూడా కొన్ని షరతులు విధించే అవకాశం ఉందని కొందరి మాట. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా గుమిగూడతారు. అందువల్ల కరోనాను అరికట్టడం కష్టమవుతుంది. దాని వల్ల ఆయా రాష్ట్రాలలోని పరిస్థితులు  బట్టి ఆంక్షలు ఉండేలా ప్రభుత్వాలు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ తర్వాత ఆంక్షలు ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి..

1. రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అటు ముఖ్యమైన సర్వీసులు మాత్రం అనుమతిస్తారని అంటున్నారు. అటు జనరల్ బోగీలను కూడా ప్రస్తుతం క్లోజ్ చేసే పరిస్థితి ఉంది.
2. లాక్ డౌన్ తర్వాత బస్సు సర్వీసులను కూడా దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
3. సూప‌ర్ మార్కెట్లు, కిరాణా షాపుల‌తో పాటు దుకాణ స‌ముదాయాల‌పై ఆంక్ష‌లు స‌డ‌లించే అవ‌కాశం ఉంది. అయితే షాపింగ్ మాల్స్, వాణిజ్య దుకాణాలను మాత్రం నిర్దిష్ట సమయం వరకే తెరిచే ఉండేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
4. లాక్ డౌన్ తర్వాత దేశీయ విమానాలు ప్రారంభించినా.. అంతర్జాతీయ సర్వీసులపై మాత్రం ఆంక్షలు ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
5. 10 సంవ‌త్స‌రాల‌లోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబ‌డిన వ‌య‌స్సు వారిని బ‌య‌ట తిర‌గ‌నీయ‌కుండా ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉంది.
6. అటు థియేటర్లు, బార్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చే వాణిజ్య సదుపాయాలపై అంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

Related Tags