Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: నేడు తిరుమల శ్రీవారి దర్శనాలపై విధి విధానాలు ప్రకటించనున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తొలి రెండు రోజులు టిటిడి ఉద్యోగుల, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహించనున్న టిటిడి. మూడో రోజు తిరుమలలో ఉన్న స్థానికులతో ట్రయల్ రన్. ఆన్ లైన్లో టిటిడి వెబ్ సైట్ ద్వారా టైం స్లాట్ బుకింగ్. భక్తుల సంఖ్య, వసతి గదుల కేటాయింపు, రవాణా, ప్రసాద విక్రయాల పై , ధర్మల్ స్క్రీనింగ్ అన్న ప్రసాద ప్రారంభం పై స్పష్టత నివ్వనున్న టిటిడి..
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

Coronavirus Effect, దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

Coronavirus Effect: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కళకళలాడే సినిమా ఇండస్ట్రీ ఈ మహమ్మారి కారణంగా కుదేలైపోయింది. ఎప్పటికప్పుడూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోలు స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నారు. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు క్లోజ్ చేయడం, రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో సినిమా ఇండస్ట్రీ కోట్లలో నష్టపోయింది. ఇక దేశవ్యాప్తంగా అమలైన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. దీని తర్వాత అయినా సినీ పరిశ్రమ వెంటనే పుంజుకుంటుందా.? అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

కరోనా వైరస్ జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనే తీవ్రంగా ఉంటుంది. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను సామాజిక దూరాన్ని పాటించమని చెబుతున్నాయి. దీనితో ఏప్రిల్ 14 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్సులకు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకవేళ అనుమతిచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అటు దేశంలో ఉన్న చాలా సింగల్ స్క్రీన్ థియేటర్లలో సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో థియేటర్లకు, షూటింగులకు ఏప్రిల్ 14న పర్మిషన్స్ వచ్చే పరిస్థితి లేదని.. మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు వరుసగా ఐదారు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్దంగా ఉండటంతో.. ఎవరు.? ఎప్పుడు.? రిలీజ్ చేయాలన్న దానిపై దర్శక నిర్మాతలు తర్జనబర్జనలు పడుతున్నారు. అటు కొన్ని సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయాలనీ కూడా పరిశ్రమ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మొదట లాక్ డౌన్ పై స్పష్టత రావాలి.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

Related Tags