ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

Coronavirus Effect: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేతులు ప్రతీసారి శుభ్రపరుచుకుంటూ ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. మరి మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపడాలంటే.? ఏమి చేయాలి.. సరిగ్గా ఇదే ఆలోచన డీఆర్‌డీఓకు రావడంతో వారు ఓ ఓ పరికరానికి (ఎన్‌క్లోజర్‌) రూపకల్పన చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ మిషన్‌లోకి వెళ్లి వ్యక్తి నిలబడితే చాలు.. అందులో ఉన్న విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు 25 సెకన్లపాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం […]

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..
Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:18 PM

Coronavirus Effect: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేతులు ప్రతీసారి శుభ్రపరుచుకుంటూ ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. మరి మనిషి మొత్తంగా ఒకేసారి శుభ్రపడాలంటే.? ఏమి చేయాలి.. సరిగ్గా ఇదే ఆలోచన డీఆర్‌డీఓకు రావడంతో వారు ఓ ఓ పరికరానికి (ఎన్‌క్లోజర్‌) రూపకల్పన చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ల్యాబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ మిషన్‌లోకి వెళ్లి వ్యక్తి నిలబడితే చాలు.. అందులో ఉన్న విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు 25 సెకన్లపాటు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేసి క్రిములన్నింటిని కడిగి పారేస్తుంది.

ఇక ఈ పరికరంలోని ట్యాంక్ సుమారు 700 లీటర్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఒకసారి దాన్ని నింపితే చాలు 650 మందిని శుభ్రం చేస్తుంది. అటు లోపల జరిగే ప్రక్రియ కూడా బయటికి కనిపించే విధంగా ఇరువైపులా అద్దాలు ఉంటాయి. ఈ తతంగం అంతటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్ ద్వారా ఆపరేటర్ పర్యవేక్షిస్తాడు. అయితే ఇందులో వెళ్లే వ్యక్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్‌డీఓ స్పష్టం చేసింది. పిచికారీ జరిగే సమయంలో కళ్లు, చెవులను పూర్తిగా మూసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లోని డీహెచ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ సహకారంతో డీఆర్‌డీఓ దీన్ని 4 రోజుల్లో తయారు చేసింది. ఆసుపత్రులు, మాల్స్‌, కార్యాలయాలకు వెళ్లేవారిని శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని డీఆర్‌డీఓ తెలిపింది.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..