కరోనాకు విరుగుడు.. వ్యాక్సిన్ తయారు చేస్తోన్న హైదరాబాద్ కంపెనీ..
Coronavirus Outbreak: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ వైరాలజిస్టులు, టీకా సంస్థ ఫ్లూజెన్‌తో కలిసి పని చేస్తోంది. భారత్ బయోటెక్ సుమారు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్దం చేయనుంది. అంతేకాక క్లినికల్ ట్రయిల్స్ కూడా నిర్వహిస్తామని వెల్లడించింది. మరోవైపు భారత్ బయోటెక్ ఇప్పటివరకు 16 వ్యాక్సిన్లను […]

Coronavirus Outbreak: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ వైరాలజిస్టులు, టీకా సంస్థ ఫ్లూజెన్‌తో కలిసి పని చేస్తోంది. భారత్ బయోటెక్ సుమారు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్దం చేయనుంది. అంతేకాక క్లినికల్ ట్రయిల్స్ కూడా నిర్వహిస్తామని వెల్లడించింది.
మరోవైపు భారత్ బయోటెక్ ఇప్పటివరకు 16 వ్యాక్సిన్లను వాణిజ్యపరంగా సిద్దం చేసింది. వీటిల్లో 2009 మహమ్మారికి కారణమైన హెచ్1 ఎన్1 ఫ్లూకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన టీకా కూడా ఉంది. అటు అక్టోబర్ నాటికి మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ను జంతువులపై పరిశోధనలు జరుపుతున్నారు. ఇక అక్కడ రాబోయే మూడు నెలల్లో మనుషులపై కూడా ట్రయిల్స్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి చదవండి:
దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..
దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..
వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం
మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..
వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..
ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..
కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..
My best wishes to our own Hyderabad Biotech company @BharatBiotech as they strive to develop a vaccine #CoroFlu for #CoronaVirus prevention
Good luck in your endeavour CMD Dr. Krishna Ella and team. Wish you all success ? pic.twitter.com/Ivd1t3KePf
— KTR (@KTRTRS) April 4, 2020