వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

COVID 19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3072 కేసులు నమోదు కాగా.. అందులో 75 మంది ఈ వైరస్ కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో దాదాపు వన్ థర్డ్ కేసులన్నీ కూడా ఢిల్లీలోని తబ్లీఘీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారివే కావడం గమనార్హం. ఇక గత 24 గంటల్లో 525 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. 13 మంది […]

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం
Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:27 PM

COVID 19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3072 కేసులు నమోదు కాగా.. అందులో 75 మంది ఈ వైరస్ కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో దాదాపు వన్ థర్డ్ కేసులన్నీ కూడా ఢిల్లీలోని తబ్లీఘీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారివే కావడం గమనార్హం. ఇక గత 24 గంటల్లో 525 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. 13 మంది ప్రాణాలు విడిచారు. ఈ నేపధ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా చికిత్స, పరీక్షలను ఆయుష్మాన్ భారత్ పధకం కిందకు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పధకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో కరోనా చికిత్స, పరీక్షలను ఉచితంగా చేయించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి వచ్చే సుమారు 50 కోట్ల మంది టెస్టులు ఫ్రీగా చేయించుకోవచ్చు. కాగా, ఏపీలో ఇప్పటికే అమలులో ఉన్న ఈ పధకం తెలంగాణలో మాత్రం అమలులో లేదు.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..