Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల కీలక నిర్ణయం.. ప్రశంసలు
ఉగాది కంటే ముందే మెగా అభిమానులకు మరో పండగ రానుంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27). ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ గురువారం (మార్చి 27) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగాభిమానులంటేనే సేవకు మారుపేరు. ఈ క్రమంలోనే చెర్రీ పుట్టిన రోజున పలు సేవా కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రచించారు. అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రాలను ప్లాన్ చేశారు. వీటితో పాటు సామాజిక స్పృహతో మెగాభిమానులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. మార్చి 27వ తేదీన అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా అభిమానులంతా మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. వృక్షాలుగా ఎదగనిద్దాం.. భవిష్యత్ తరాలకు నీడనిద్దాం’ అని నెట్టింట పోస్ట్ పెట్టారు. దీంతో మెగాభిమానుల నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాతో మెగాభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. దీంతో వారి ఆశలన్నీ ఇప్పుడు ఆర్ సీ 16 సినిమాపైనే ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ పుట్టిన రోజున ఆర్ సీ 16 నుంచి కూడా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజేయ్య అవకాశముందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం. వృక్షాలుగా ఎదగనిద్దాం… భవిష్యత్ తరాలకు నీడనిద్దాం…
*మార్చి 27గ్లోబల్ స్టార్ రామ్* *చరణ్ గారి* *పుట్టినరోజు సందర్భంగా…*
*మొక్కలు నాటే కార్యక్రమం*
అఖిల భారత చిరంజీవి యువత pic.twitter.com/xARSUZzsbo
— Ravanam Swami naidu (@swaminaidu_r) March 25, 2025
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ సీ 16 సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం.
ఆర్ సీ 16 సెట్ లో..
Global Star @AlwaysRamCharan Garu gets a solid makeover by @AalimHakim Ji.
Super excited …!!!!❤️❤️❤️❤️🔥🔥🔥@NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/qBCuxcp4Hv
— BuchiBabuSana (@BuchiBabuSana) November 25, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .