AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Tourism: వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ తెరుచుకునేది ఈ టైంకే!

వైజాగ్‌ టూర్‌కు వెళ్లే పర్యాటకులు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఇకపై మీరు ఆర్కేబీచ్‌ సమీపంలోని మ్యూజియంలను సందర్శించేందుకు మధ్యాహ్నం రెండు గంటల వరకు వెయిట్ చేయాల్సిన పనిలేదు. అవును బీచ్‌ రోడ్‌లో ఉన్న అన్ని మ్యూజియంలు ఇకపై ఉదయం 10గంటల నుంచే తెరుచుకోనున్నాయి.

Vizag Tourism: వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ తెరుచుకునేది ఈ టైంకే!
Vizag Museums Open Early
Anand T
|

Updated on: Dec 28, 2025 | 7:00 PM

Share

వింటర్ సీజన్ వచ్చిందంటే చాలూ చాలా మంది ఏపీ టూర్‌కు వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే శీకాలంలో అరకు, వనజంగి వంటి ప్రదేశాల్లో సన్‌రైజ్ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఏపీ టూర్‌కు వచ్చారంటే వాళ్లు వైజాగ్‌ కచ్చితంగా చూడాల్సిందే.. వైజాగ్‌లో మేన్‌గా చూసే ప్లేస్‌లు అన్ని.. ఒక్క ఆర్కే బీచ్‌ చుట్టు పక్కనే ఉన్నాయి. అవే సబ్‌రేయన్ మ్యూజియం, సీ యారియర్, ఎయిర్‌ క్రాప్ట్‌ మూజియం ఇలా అన్ని ఒక్క దగ్గరే ఉంటాయి. అయితే ప్రస్తుతం వీకెండ్‌ సెలవుల నేపథ్యంలో వైజాగ్‌కు భారీగా పర్యాటకులు పోటెత్తారు. ఇక్కడ ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. అక్కడున్న మ్యూజియంలు అన్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. దీంతో ఉదయం వాటిని చూద్దామని వచ్చిన పర్యాటకులు మధ్యాహ్నం వరకు అక్కడే వేచి ఉండాల్సి వస్తుంది.

అయితే తాజాగా వైజాగ్‌ సబ్‌రేరియన్ బీచ్‌ సందర్శనకు వచ్చిన VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఎండగా భారీగా పర్యాటకులు వేచి ఉండడం చూశాడు. వారిని విశ్రాంతి గదిలోకి వెళ్లాలని సూచించారు. అయితే పర్యాటకుల రద్దీ ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత మ్యూజియంలు ఓపెన్ చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఇకపై పర్యాటకుల రద్దీ ఉన్నప్పుడు ఉదయం VMRDA పరిధిలో ఉన్న అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే ఓపెన్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

దీంతో పాటు బీచ్‌లో ఉన్న కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట పర్యాటకులు రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలానే పర్యాటక ప్రాంతాల్లో ఉండే వాష్‌రూమ్‌లు క్లీన్‌గా ఉంచాలని తెలిపారు.బీచ్ రోడ్ లో ఎలాంటి పార్కింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో తాగు నీటి సదుపాయాలు కల్పించాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.