Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. తీహార్ జైలు తరలింపునకు రూ. 10 కోట్లు మంజూరు..ఎక్కడికంటే..

ఇక తిహార్ జైలును 1958లో నిర్మించగా.. 1966లో పంజాబ్ దీని నిర్వహణను ఢిల్లీకి బదిలీ చేసింది. ఈ జైలు 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 9 కేంద్ర కారాగారాలు ఉన్నాయి. పెరుగుతున్న ఖైదీల సంఖ్య దృష్ట్యా, తీహార్ జైలును ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం, తీహార్ జైలులో దాదాపు 10 వేల మంది ఖైదీలను ఉంచవచ్చు. అయితే దాని సామర్థ్యం..

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. తీహార్ జైలు తరలింపునకు రూ. 10 కోట్లు మంజూరు..ఎక్కడికంటే..
Tihar Jail
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2025 | 9:07 PM

ఆసియాలోనే అతి పెద్దదైన తిహార్‌ జైలుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఢిల్లీ సర్కార్‌. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తిహార్‌ జైలును మరో చోటుకు తరలించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. తీహార్ జైలును మరోక చోటకి తరలిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం రేఖ గుప్తా జైలు తరలింపునకు తీహార్ జైలు బదిలీకి సంబంధించి సర్వే, సంప్రదింపులు వంటి సేవల కోసం 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు. అయితే, జైలు చుట్టుపక్కల ఉన్న ప్రజల భద్రత, రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తీహార్ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల, భద్రతా కారణాల దృష్ట్యా దానిని మార్చాలని నిర్ణయించారు. ఇటీవల, తీహార్ జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ సంఘటనలు కూడా నమోదయ్యాయి. ప్రతీకారంగా ఇద్దరు ఖైదీలపై ఘోరమైన దాడి జరిగింది. ఇది జైలు భద్రతా వ్యవస్థల పట్ల అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తీహార్ జైలు పరిస్థితి భద్రతకు మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిపాలనా సంస్కరణల అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇక తిహార్ జైలును 1958లో నిర్మించగా.. 1966లో పంజాబ్ దీని నిర్వహణను ఢిల్లీకి బదిలీ చేసింది. ఈ జైలు 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 9 కేంద్ర కారాగారాలు ఉన్నాయి. పెరుగుతున్న ఖైదీల సంఖ్య దృష్ట్యా, తీహార్ జైలును ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం, తీహార్ జైలులో దాదాపు 10 వేల మంది ఖైదీలను ఉంచవచ్చు. అయితే దాని సామర్థ్యం 7 వేల మంది ఖైదీలు మాత్రమేనని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..