రష్మిక రాబిన్ హుడ్ సినిమాను అందుకే చేయలేదు.. శ్రీలీల..

25 March 2025

రష్మిక రాబిన్ హుడ్ సినిమాను అందుకే చేయలేదు.. శ్రీలీల.. 

Rajitha Chanti

Pic credit - Instagram

image
ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది హీరోయిన్ శ్రీలీల. ఇందులో నితిన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది హీరోయిన్ శ్రీలీల. ఇందులో నితిన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 

ఈ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

ఈ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. 

ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

ఈ సినిమాలో విదేశాల నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తానని.. క్యారెక్టరైజేషన్‌ చాలా క్యూట్‌గా ఉంటుందని తెలిపింది. 

నిజానికి ఈ పాత్రను రష్మిక చేయాల్సి ఉందని.. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదని చెప్పుకొచ్చింది హీరోయిన్ శ్రీలీల. 

పుష్ప 2 సినిమా చిత్రీకరణలో కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పారని.. ఈ పాత్ర తనకు చాలా నచ్చి చేశానంటూ చెప్పుకొచ్చింది. 

నితిన్ తో పనిచేయడం చాలా ప్రశాంతంగా ఉంటుందని.. ఫ్యామిలీ పర్సన్ లా ఉంటారని.. ఇద్దరిది హిట్ పెయిర్ అని అన్నారు శ్రీలీల. 

గతేడాది తాను చేసిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయని... ఆ మూవీస్ కోసం ఒక్కో రోజు నాలుగైదు షిప్టులలో పనిచేసినట్లు తెలిపింది.