రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..

గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన యూనిటీ కోసం.. ఉక్కు మనిషి 'సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని' ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం మీకు గుర్తుందా? అదేంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని అమ్మేస్తున్నారా..

రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 05, 2020 | 1:43 PM

యూనిటీ కోసం.. ఉక్కు మనిషి ‘సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని’ ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం మీకు గుర్తుందా? అదేంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని అమ్మేస్తున్నారా? నిజంగానే ఇది షాకింగ్ విషయమే కదా. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన సాధుబెట్ అనే చిన్న దీవిలో ఏర్పాటు చేసిన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఇప్పుడు ‘ఓఎల్ఎక్స్’ దీన్ని అమ్మకానికి పెట్టేశారు. రూ.30 వేల కోట్లు చెల్లించి దీన్ని సొంతం చేసుకునే అద్భుత అవకాశం వచ్చింది. అయితే దీన్ని విక్రయిస్తున్నది కంపెనీలు కాదు.. ఇతర దేశ ప్రభుత్వాలు కాదు.. ఓ నెటిజన్. నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు కదా.

అవును.. దీన్ని ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైటులో గుర్తుతెలియని వ్యక్తి.. అమ్మకానికి పెట్టాడు. అయితే దీని వెనుక ఓ కారణం కూడా లేకపోలేదు. దీనికి కరోనా వైరస్‌ని కూడా వాడుకున్నాడు ఆ నెటిజన్. ఇంతకీ అతను ఈ విగ్రహాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టాడంటే? ‘కరోనా వైరస్ నేపథ్యంలో ఓ వ్యక్తి దీన్ని అమ్మకానికి పెట్టాడు. ఉక్కు మనిషి పటేల్ విగ్రహం ఫొటోలను అప్‌లోడ్ చేసి రూ.30 వేల కోట్లకు అమ్మేస్తున్నట్లు తెలిపాడు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐక్యతా విగ్రహాన్ని అమ్మానికి పెట్టాం. ఈ డబ్బులతో హాస్పిటళ్లు, వైద్య పరికరాలను కొనుగోలు చేయాలి’ అని అతని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అత్యవసరంగా అమ్మేస్తున్నాం..

అయితే ఈ విగ్రహం ఫొటోలు ఉన్నాయని తెలియగానే ఓఎల్‌ఎక్స్ నిర్వాహకులు దాన్ని సైటు నుంచి తొలగించారు. కానీ ఈ పోస్ట్‌కి సంబంధించిన స్క్రీన్‌ షార్ట్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. ‘రెడిట్ పోస్ట్ చేసి’.. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా రిప్లైలు ఇస్తున్నారు. మహానుభావుల విగ్రహాలను పెట్టి స్మరించుకోవడంలో తప్పులేదు. కూడు, గూడుకు గతిలేని పేదలున్న ఈ దేశంలో.. గొప్పల కోసం వేల కోట్లు ఖర్చుపెట్టడంలో తప్పు లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.

కాగా.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ 31వ తేదీన రూ.3 వేల కోట్లను వెచ్చించి ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ విగ్రహం కొన్నాళ్లు పర్యాటక కేంద్రంగా వెలుగొందింది.

గమనిక: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సమాచారాన్ని యథావిథిగా ఇక్కడం అందించాం. దానికి సంబంధించిన ఫ్రూఫ్‌లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్‌లో కష్టాలు

ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు

బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం

ఈరోజే ‘మోదీ దీపావళి’.. సిద్ధమవుతోన్న భారతీయులు

కింగ్ కోఠి కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసమట.. అధికారులు ఏం చేశారంటే

మనదేశంలో కరోనా బాధితుల్లో యువతే అధికం.. కేంద్రం షాకింగ్ వివరాలు