ఆస్ప‌త్రి బెడ్ మీద ఆమె మెడ‌లో ప‌సుపుతాడు క‌ట్టాడు.. అయినా కాపాడుకోలేకోయాడు

క‌రోనా కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తుంది. మనుషులను ఒక్క‌సారిగా మింగేస్తుంది. తేరుకునేలోపుగానే డ్యామేజ్ జ‌రిగిపోతుంది. అయినవాళ్ల‌ను కోల్పోయి ఎంతోమంది విషాదంలో ఉన్నారు.

ఆస్ప‌త్రి బెడ్ మీద ఆమె మెడ‌లో ప‌సుపుతాడు క‌ట్టాడు.. అయినా కాపాడుకోలేకోయాడు
Corona Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2021 | 8:47 AM

క‌రోనా కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తుంది. మనుషులను ఒక్క‌సారిగా మింగేస్తుంది. తేరుకునేలోపుగానే డ్యామేజ్ జ‌రిగిపోతుంది. అయినవాళ్ల‌ను కోల్పోయి ఎంతోమంది విషాదంలో ఉన్నారు. ఎన్నో కుటుంబాలు వ్య‌ధ‌ను అనుభ‌విస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న క‌న్నీళ్లు పెట్టిస్తోంది. జిల్లాకు చెందిన‌ 27 ఏళ్ల యువతి త‌న వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. మంచి జాబ్ చేస్తూ, త‌న‌పై ఎంతో ప్రేమ ఉన్న వ్య‌క్తిని ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించాలనుకుంది. కానీ ఇంత‌లోనే క‌రోనా ఆమెపై చిన్న‌చూపు చూసింది. పాజిటివ్‌గా తేల‌డంతో కుటుంబ స‌భ్యులు ట్రీట్మెంట్ కోసం ఆమెను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మూడేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడూ ఆమెను కాపాడ‌కునేంద‌కు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశాడు. ధైర్యం నూరిపోశాడు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్ట‌ర్లు ఆమెను వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు. డాక్ట‌ర్లు అనుమతితో యువకుడు వెంటిలేటరుపై చికిత్సలో ఉన్న యువతితో మాట్లాడాడు.

‘నీకేం కాదు.. కరోనాను జయించి నువ్వు క్షేమంగా ఇంటికొస్తావు. అందరూ మెచ్చేలా మనం మంచి జీవితాన్ని గ‌డ‌పుతాం’ అని భరోసా ఇచ్చాడు. ఆ క్షణమే ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న యువతి మెడలో తాళి కట్టి.. ‘ఇక‌పై నేను నీ భ‌ర్త‌ను’ అని అభ‌య‌మిచ్చాడు. కానీ.. క‌రోనా మ‌హమ్మారి ఆ జంటను చూసి ఓర్వ‌లేక‌పోయింది. వెంటిలేటరు మీద ఉన్న ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవల తుదిశ్వాస విడిచింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడే దగ్గరుండి ఆ యువతి అంత్యక్రియలు చేశారు. ఆమె మరణించిన విషయం మాత్రం తల్లిదండ్రులకు తెలియదు. ఈ విష‌యం తెలిస్తే వారి దుఃఖాన్ని ఊహించి.. ఆమె సోదరుడు, తాళి కట్టిన యువకుడు.. చెప్పేందుకు సాహ‌సించ‌డంలేదు. కడుపులోంచి తన్నుకొస్తున్న గుండెల్లోనే అదిమిపట్టి కుమిలిపోతున్నారు. క‌రోనా ఇంకెన్నాళ్లు ఈ క‌ష్టాలు.

Also Read ఏపీ డిజీపీ పేరిట ట్విటర్ అకౌంట్.. వెంట‌నే ఫాలో ఎస్పీలు, ఇంత‌లో ఊహించ‌ని ప‌రిణామం

తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు