AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Positive: ప్రభుత్వపాఠశాలలో కరోనా కలకలం.. నలుగురు ఉపాధ్యాయులకు, 10మంది విద్యార్ధులకు పాజిటీవ్..

సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విద్యార్థులను వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న..

Corona Positive: ప్రభుత్వపాఠశాలలో కరోనా కలకలం.. నలుగురు ఉపాధ్యాయులకు, 10మంది విద్యార్ధులకు పాజిటీవ్..
Covid
Sanjay Kasula
|

Updated on: Jan 27, 2022 | 3:00 PM

Share

Corona Positive: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విద్యార్థులను వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి ప్రభుత్వపాఠశాలలో(Government School) కరోనా కలకలం రేపింది. ఈ పాఠశాలలోని 14 మందికి కోవిడ్ సోకింది. ఇందులో 10 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు తాజాగా కరోనా బారినపడ్డారు. అయితే మిగతా విద్యార్థులకు ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా సోకిన విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని ఐసోలేషన్(Isolation)లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే బాధితులను తరలించేందుకు వీలుగా పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. పాఠశాలకు వస్తున్న కొందరు బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు టీచర్లు గమనించారు. బాధిత విద్యార్థినులకు కరోనా పరీక్షలు(Covid Tests) నిర్వహించగా.. 10 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడైంది.

ఏపీలో కోవిడ్ వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు  49,143 శాంపిల్స్ ని పరీక్షించగా 13,618 మందికి కరోనా సోకినట్లు తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2222573 కి చేరింది. కొత్తగా కోవిడ్ కారణంగా తూర్పు గోదావరి(East Godavari), నెల్లూరు(Nellore), విశాఖపట్నం(Vizag) జిల్లాలలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి లలో ఒక్కొ క్కరు చొప్పు న మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14570కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 106318 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూాడా చదవండి: Hyderabad: కొడుకుని చూడనివ్వకుండా అడ్డుకున్న భర్త.. తీవ్ర మనస్తాపంతో భార్యఆత్మహత్య!

Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఈ ఆయుర్వేదం చిట్కాలను పాటించడం మంచిది..