వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 122207 కొత్త కేసులు రావడంతో..

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 7:42 AM

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా శనివారం 122207 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 69,62,528కి చేరాయి. అలాగే నిన్న 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 401544కి చేరింది. అలాగే దాదాపు 34.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. శనివారం కొత్తగా 21975 కేసులొచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,87,683కి చేరాయి. అలాగే నిన్న 687 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 112077కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా భారత్‌లో 9887 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 236657కి చేరింది. అలాగే 20 గంటల్లో 294 మంది చనిపోయారు. ఇంత భారీగా చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6642కి చేరింది. తాజాగా 4611 మంది రికవరీ అవ్వడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 114072గా ఉంది. మన దేశంలో కరోనా సోకిన వారిలో 48.2 శాతం మంది రికవరీ అవుతుండటం మంచి విషయం.

దేశాల వారీగా కరోనాకేసులు:

  • బ్రెజిల్‌లో 6,73,587 కరోనా పాజిటివ్ కేసులు, 35,957 మంది మృతి
  • రష్యాలో 4,58,689 కరోనా పాజిటివ్ కేసులు, 5,725 మంది మృతి
  • స్పెయిలో 2,888,390 కరోనా కేసులు, 27,135 మంది మృతి
  • యూకేలో 2,84,868 కరోనా పాజిటివ్ కేసులు, 40,465 మంది మృతి
  • ఇటలీలో 2,34,801 కోవిడ్ కేసులు, 33,846 మంది మృతి
  • జర్మనీలో 1,85,696 కరోనా పాజిటివ్ కేసులు, 8,769 మంది మృతి
  • ఫ్రాన్స్‌ల 1,53,634, కోవిడ్ పాజిటివ్ కేసులు, 29,142 మంది మృతి