తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 213...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో ప్రజలు
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 8:04 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 213 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నలుగురు మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 165 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 16, మెదక్ 13 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 261 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. మంగళవారం కొత్త‌గా 264 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 193 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 44 మంది, విదేశాలకు చెందినవారు 27 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5280కి చేరింది. అలాగే 2851 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2341గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 88కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తోంది.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం