Breaking: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి..

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే అనేక మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా కరోనాపై పోరులో ప్రజలను ముందుండి నడిపిస్తున్న పోలీసులు, వైద్యులలో కొంతమంది కూడా ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక తాజాగా కరోనా కారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ తుది శ్వాస విడిచారు. ఆదివారం రాత్రి బద్రుద్దీన్ షేక్‌ అహ్మదాబాద్‌లోని ఎస్‌విపి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచినట్లు ఏఐసీసీ […]

Breaking: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి..
Follow us

|

Updated on: Apr 27, 2020 | 1:48 PM

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే అనేక మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా కరోనాపై పోరులో ప్రజలను ముందుండి నడిపిస్తున్న పోలీసులు, వైద్యులలో కొంతమంది కూడా ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక తాజాగా కరోనా కారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ తుది శ్వాస విడిచారు.

ఆదివారం రాత్రి బద్రుద్దీన్ షేక్‌ అహ్మదాబాద్‌లోని ఎస్‌విపి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచినట్లు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన 40 ఏళ్ల పాటు పని చేశారని.. ఆయన లేని లోటు తీర్చలేనిదని ట్విట్టర్ వేదికగా గోహిల్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ షేక్‌.. అప్పటి నుంచి ఎస్‌విపి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. కాగా, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి సహాయం చేసే క్రమంలో బద్రుద్దీన్ షేక్‌ కరోనా బారిన పడ్డారని సహచర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

కరోనా రోగుల అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు..