‘నేను బ్రతికే ఉన్నాను’.. కిమ్ సందేశం.. వారికి హెచ్చరిక..
నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆయన చనిపోయారంటూ ప్రచారం చేస్తుంటే.. మరికొందరు ఆయన బ్రెయిన్ డెడ్ అని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉత్తర కొరియా ప్రభుత్వం నుంచి ఓ కీలక ప్రకటన విడుదల అయింది. కిమ్ మరణించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఓ రిసార్ట్‌లో […]

నార్త్ కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆయన చనిపోయారంటూ ప్రచారం చేస్తుంటే.. మరికొందరు ఆయన బ్రెయిన్ డెడ్ అని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉత్తర కొరియా ప్రభుత్వం నుంచి ఓ కీలక ప్రకటన విడుదల అయింది. కిమ్ మరణించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఓ రిసార్ట్‌లో సేద తీరుతున్నారని.. ఇక అక్కడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుంటున్నారని కిమ్ భద్రతా సలహాదారు తెలిపారు. అటు కిమ్ జాంగ్..కొరియాకు చెందిన టీవీ ఛానల్‌కు తాను ఆరోగ్యంగానే ఉన్నట్లుగా పేర్కొంటూ లిఖితపూర్వక సందేశాన్ని పంపించారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్ చుంగ్ ఇన్ కిమ్ ఆరోగ్యంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కిమ్ బ్రతికే ఉన్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని వెల్లడించారు. తమ ప్రభుత్వం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడూ నిశితంగా గమనిస్తోందని.. ఉత్తర కొరియాకు తూర్పు ప్రాంతమైన వాన్‌సన్‌లో కిమ్ ఏప్రిల్ 13 నుంచి ఉంటున్నట్టు తెలిసిందని చుంగ్ ఇన్ తెలిపారు. ఇక అతని ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని స్పష్టం చేశారు. ఇక కిమ్ నుంచి సందేశం బయటికి రావడంతో శత్రుదేశాల వారు భయపడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఏప్రిల్ 11 నుంచి కిమ్ అదృశ్యమయ్యారు. ఫైటర్ జెట్ విమానాలను పరిశీలించేందుకు వెళ్లారని ఆ దేశ మీడియా తెలపగా.. ఏప్రిల్ 15న కిమ్ తన తాత 108వ జయంతి వేడుకలకు దూరంగా ఉండటంతో ఆయన ఆరోగ్యం బాగోలేదని.. విషమంగా ఉందంటూ వదంతులు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు నియంత నుంచే ఇలాంటి సందేశం రావడంతో.. హిట్లర్ 2.o అబీ జిందా హై అని నెట్టింట్లో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
