AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ మార్క్ నిర్ణయం.. ఏపీలో రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు అనుమతి!

లాక్ డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అనుమతిచ్చిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడికి అవసరమయ్యే చర్యలతో పాటు.. లాక్ డౌన్ అనంతరం రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయమై అనుసరించాల్సిన విధానాలపై ఆదివారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని […]

జగన్ మార్క్ నిర్ణయం.. ఏపీలో రాత్రి 7 గంటల వరకు దుకాణాలకు అనుమతి!
Ravi Kiran
|

Updated on: May 11, 2020 | 12:21 PM

Share

లాక్ డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అనుమతిచ్చిన ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడికి అవసరమయ్యే చర్యలతో పాటు.. లాక్ డౌన్ అనంతరం రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయమై అనుసరించాల్సిన విధానాలపై ఆదివారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలపై వారిలో అవగాహన పెంచాలని సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చే భారతీయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవారు తమ గమ్యస్థలాలకు చేరే వరకు యాప్‌ ద్వారా ట్రాక్‌ చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం వారి వివరాలను గ్రామంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ హెల్త్ అసిస్టెంట్లు నమోదు చేసుకుంటారని చెప్పారు. అంతేకాకుండా హోం క్వారంటైన్, క్వారంటైన్ కేంద్రాల నుంచి పంపేటప్పుడు అనుసరిచాల్సిన ప్రోటోకాల్ విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ అనంతరం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన హెల్త్‌ ప్రొటోకాల్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!