Corona: దేశీయ విమాన ప్రయాణికులకు ఇకపై నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదు? ఈ ఛాన్స్ వారికి మాత్రమే..
Corona: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. సుమారు నెల రోజుల పాటు దేశం మొత్తం చిగుగురాటులా వణికిపోయింది. లక్షల్లో నమోదువుతోన్న కేసులు.. వేలల్లో సంభవిస్తోన్న మరణాలతో ఎక్కడ చూసిన భయానక..
Corona: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. సుమారు నెల రోజుల పాటు దేశం మొత్తం చిగుగురాటులా వణికిపోయింది. లక్షల్లో నమోదువుతోన్న కేసులు.. వేలల్లో సంభవిస్తోన్న మరణాలతో ఎక్కడ చూసిన భయానక సన్నివేశాలు కనిపించాయి. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాలు నిబంధనలను తీవ్ర కఠినతరం చేశాయి. ఇందులో భాగంగా దేశీయంగా విమానాల్లో ప్రయాణం చేసే వారిలో ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వరికే అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేథ్యంలో ఆంక్షలను సడలించే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగానే దేశీయ విమాన ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్సనిసరి నిబంధనను తొలగించే విషయమై కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే ఈ అవకాశం రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపై దేశీయంగా విమానాల్లో ప్రయాణించడానికి ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పకుండా సమర్పించాలన్న నిబంధనను తొలగించే యోచన చేస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురి పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉన్నదని వివరించారు. ఈ నిర్ణయాన్ని కేవలం పౌరవిమానయాన శాఖ స్వయంగా తీసుకోలేదని, నోడల్ ఏజెన్సీ ఆరోగ్య శాఖ నిపుణుల అభిప్రాయాలు ఈ నిర్ణయం కోసం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read: Jama Masjid: ప్రధాని మోదీకి.. ఢిల్లీ జామా మసీదు షాహీఇమామ్ లేఖ.. ఎందుకో తెలుసా..?
AIIMS Recruitment: ఎయిమ్స్ భువనేశ్వర్‌లో ఉద్యోగాలు… దరఖాస్తులకు నేడే చివరి తేదీ..