AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది.. పండగ సీజన్‌లో మళ్లీ పడగవిప్పొచ్చు.. రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం.

Coronavirus: సెకండ్‌ వేవ్‌ సమయంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే తగ్గుతోన్న...

Coronavirus: కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది.. పండగ సీజన్‌లో మళ్లీ పడగవిప్పొచ్చు.. రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం.
Corona Cases
Narender Vaitla
|

Updated on: Aug 28, 2021 | 1:29 PM

Share

Coronavirus: సెకండ్‌ వేవ్‌ సమయంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే తగ్గుతోన్న కేసుల సంఖ్య చూసి సంతోషపడే పరిస్థితులు లేవని కేంద్రం హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో వినాయక చవితి, దసరా ఇలా పండుగల సీజన్‌ మొదలు కానుంది. దీంతో ఇప్పటికే మార్కెట్లలో సందడి షురూ అయ్యింది. ప్రజా రవాణా వ్యవస్థ మళ్లీ గాడినపడుతోంది. బస్సులు, రైళ్లలో ప్రయాణీకుల రద్దీ మొదలయ్యింది. సెప్టెంబర్-అక్టోబర్‌లో గణేశ చతుర్ధి, దసరా ఉత్సవాలతో జనం గుమిగూడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోన్నా ఇప్పటికే కొన్ని కొన్ని జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు ఉండటం ఆందోళనకలిగిస్తోందని కేంద్రం అభిప్రాయపడింది. హై-పాజిటివిటీ రేటు ఉన్న చోట వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శకులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పండుగల సమయంలో జనాలు గంపులుగా గుమికూడకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

టెస్ట్, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌, కోవిడ్‌ ప్రవర్తనా నియమావళి ఇలా ఐందంచెల వ్యూహాన్ని అమలు చేయాలని తెలిపారు. వీటిని అమలు చేసేందుకు స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇక అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సర్వైలెన్స్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Also Read: New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే

New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే

Viral Photos: ప్రపంచంలో ఇది వింతైన జలపాతం..! ప్రజలు కింది నుంచి పైకి జారిపోకుండా ఎక్కవచ్చు..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!