Viral Photos: ప్రపంచంలో ఇది వింతైన జలపాతం..! ప్రజలు కింది నుంచి పైకి జారిపోకుండా ఎక్కవచ్చు..
Viral Photos: పట్టణాలలో నివసించే ప్రజలు తరచుగా అందమైన పర్వతాలు, జలపాతాల మధ్య గడపడానికి ఇష్టపడతారు. అయితే జలపాతాల దగ్గరికి వెళితే అక్కడున్న బండల చుట్టూ నాచు పేరుకుపోయి ఉంటుంది.
ఎవరైనా ఈ బండలపై జారిపోకుండా పైకి ఎక్కవచ్చు. అంతేకాదు ఎక్కడానికి ఇబ్బంది ఉంటే దాని వైపు ఒక తాడు కూడా ఉంటుంది. దానిని పట్టుకొని ఎక్కుతూ ప్రత్యేక అనుభూతి పొందవచ్చు.
Follow us
పట్టణాలలో నివసించే ప్రజలు తరచుగా అందమైన పర్వతాలు, జలపాతాల మధ్య గడపడానికి ఇష్టపడతారు. అయితే జలపాతాల దగ్గరికి వెళితే అక్కడున్న బండల చుట్టూ నాచు పేరుకుపోయి ఉంటుంది. దీని కారణంగా జారిపోతామనే భయం ఉంటుంది. కానీ ఈ జలపాతం దగ్గరికి వెళితే జారిపోకుండా సులభంగా ఎక్కవచ్చు.
అవును థాయ్‌లాండ్‌లో అలాంటి జలపాతం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. 330 అడుగుల ఎత్తు ఉన్న ఈ జలపాతాన్ని ‘స్టిక్కీ’ జలపాతం అంటారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే రాళ్లపై ప్రవహించే ఈ నీరు తెలుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటుంది.
ఎవరైనా ఈ బండలపై జారిపోకుండా పైకి ఎక్కవచ్చు. అంతేకాదు ఎక్కడానికి ఇబ్బంది ఉంటే దాని వైపు ఒక తాడు కూడా ఉంటుంది. దానిని పట్టుకొని ఎక్కుతూ ప్రత్యేక అనుభూతి పొందవచ్చు.
ఈ జలపాతం నీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా రాళ్లపై నాచు ఏర్పడదు.
ఈ జలపాతం సున్నపు రాళ్లపై నుంచి ప్రవహిస్తుంది. అందుకే వాటిని తాకినప్పుడు గట్టి స్పాంజిలా కనిపిస్తుంది. బలమైన పట్టు కారణంగా ఎవరైనా సులభంగా ఎక్కవచ్చు. దిగవచ్చు. దిగువ నుంచి పైకి వెళ్లే థ్రిల్ కోసం చాలా మంది ఈ జలపాతం చూడటానికి వస్తారు.