- Telugu News Photo Gallery Viral photos Neelakurinji flowers bloom after 12 years in kodagu district photo gallery
Neelakurinji flowers: కొడగు కొండల అందాలు.. 12 ఏళ్ల తర్వాత పూసిన అరుదైన పుష్పాలు
ప్రకృతి అద్భుతమైనది అనడంలో ఎవరికీ ఏ సందేహమూ ఉండకపోవచ్చు. అందుకు నీలకురింజి పూలే నిదర్శనం. ఆ పూల విశేషాలు తెలుసుకుందాం. ఓసారి కర్ణాటక వెళ్లొద్దాం.
Updated on: Aug 28, 2021 | 7:00 PM

నీలి ప్రపంచాన్ని పరచకున్న వీటి పేరు నీలకురింజి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో... మందల్‌పట్టి, కోటె బెట్టా కొండల్లో ఈ పూలు 12 ఏళ్లకు ఓసారి పూస్తాయి

పర్పుల్ కలర్‌లో పూసే ఈ పూలను చూసేందుకు... ఆ ప్రకృతిలో విహరించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముందుగా కొడగు జిల్లాకు వచ్చి... అక్కడి నుంచి ఈ కొండలకు వస్తున్నారు.

డబ్బు ఉండాలే గానీ ఈ పూలను ఆకాశం నుంచి చూసేందుకు ఈసారి హెలికాప్టర్ టాక్సీలు కూడా ఉన్నాయి. హెలీ-టాక్సీ సంస్థ తంబీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆఫర్ ఇస్తోంది.

కర్ణాటకలో కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అందువల్ల ప్రజలు కొన్ని రకాల ఆంక్షల్ని పాటిస్తున్నారు. అలాంటి వారికి ఈ పూల సందర్శనం ఎంతో మానసిక ఉల్లాసం కలిగిస్తోంది.

స్థానికంగా ఈ పూలను కురింజి అంటారు. ఇవి ఎత్తైన కొండలపై 1300 నుంచి 2400 మీటర్ల ఎత్తులో పూస్తాయి.

ఇవి చాలా అందంగా ఉండే కొండలు. అందువల్లే ఇక్కడకు కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. లక్కీగా ఈసారి అన్ని కొండలపైనా ఈ పూలు బాగా వచ్చాయి.

బెంగళూరుకు చెందిన తంబీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్న హెలికాప్టర్లలో కొండలపై ట్రిప్ వేసేందుకు రూ.2,30,000 తీసుకుంటున్నారు.

ఈ పూల మొక్కలు 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి.

నీలకురింజీలలో 45 రకాల జాతుల మొక్కలున్నాయి. అవి ఒక్కో రకం ఒక్కో ఎత్తు ప్రాంతాల్లో పెరుగుతాయి. కొన్ని మొక్కలు ఆరేళ్లకోసారి పూలు పూస్తాయి. కొన్ని 9ఏళ్లు, మరికొన్ని 11, 12 ఏళ్లకోసారి పూలు పూస్తాయి.

గతేడాది చిక్‌మంగళూరు జిల్లాలోని బాబా భూదానగిరి కొండలపై నీలకురింజీలలోని ఓ రకం మొక్కలకు పూలు పూశాయి.




