New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే

New Headteacher: తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక విద్యార్థి భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దనేందుకు ఉపాధ్యాయుడి కృషి ఎనలేనిది. దేశాన్ని ఎలా రాజు, ప్రాణం పోసే డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా ఏ వృత్తివారిని తీసుకున్నా..

New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే
Head Teacher
Follow us

|

Updated on: Aug 28, 2021 | 1:09 PM

New Headteacher: తల్లిదండ్రుల తర్వాత గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక విద్యార్థి భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దనేందుకు ఉపాధ్యాయుడి కృషి ఎనలేనిది. దేశాన్ని ఎలా రాజు, ప్రాణం పోసే డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా ఏ వృత్తివారిని తీసుకున్నా వారిని అంత గొప్పగా తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా టీచర్ దే.. అందుకనే మన పెద్దలు అంటారు.. దేశాన్ని ఏలే రాజైనా ఒక గురువుకు విద్యార్థి అని.. అయితే ఇంతగా చదువు చెప్పే టీచర్ కు సమాజంలో ఇస్తున్న గౌరవం ఎంత అంటే.. నేటి సినిమాలు చూస్తే తెలుస్తుంది అంటూ కొంతమంది వాపోతుంటారు కూడా… అలాంటి ఓ టీచర్ ఎంతమంది విద్యార్థులున్నా నా వృత్తి పట్ల అంకిత భావం చూపిస్తుంటా అని చదువు చెప్పడానికి కొండకోనల్లో ప్రయాణం చేసిన చేస్తున్న టీచర్ల గురించి వార్తలు వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ ప్రాంతంలో స్కూల్ లో విద్యార్థులు ముగ్గురు.. వారికిఇ చదువు చెప్పడానికి ఒక టీచర్ కావాలి అంటూ ప్రకటన ఇచ్చారు. అయితే ముగ్గురు స్టూడెంట్స్ కదా శాలరీ తక్కువ అనుకోకండి… ముచ్చటగా ముగ్గురుకి చదువు చెప్పే టీచర్ కు అక్షరాలా రూ. 57 లక్షల జీతం ఇస్తామని ప్రకటించారు. మరి ఆ స్కూల్ స్పెషాలిటీ ఏమిటి.. అది ఎక్కడ ఉందో వివరాల్లోకి వెళ్దాం..

స్కాట్‌ల్యాండ్‌లోని ఓర్కనే, షెట్‌ల్యాండ్‌కు మధ్యలో 1,900 ఎకరాల్లో ఓ చిన్న దీవి విస్తరించి ఉంది. ఈ దీవిలో కేవలం 51 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరి పిల్లలు చదువుకోసం ఒక పాఠశాల భవనం కూడా ఉంది. అయితే కేవలం ముగ్గురు స్టూడెంట్స్ మాత్రమే అక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న అనంతరం సెకండరీ ఎడ్యుకేషన్ కోసం షెట్‌ల్యాండ్‌‌కు వెళ్తారు. . ఇక్కడ హెడ్ టీచర్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ఉద్యోగంలో చేరే హెడ్ టీచర్‌కు ఇల్లు కూడా ఇస్తామని తెలిపారు. దీంతో ఈ దీవి ఇది చాలా అందమైన, మనోహరమైన ప్రదేశమని ప్రపంచ ప్రఖ్యాత నిట్వేర్ తెలిపారు.

ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. ఈ స్కూల్‌లో చేరే టీచర్‌కు ఏడాదికి 56,787 పౌండ్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.57,45,042 జీతం ఇస్తారన్న మాట. అంతేకాదు ఈ స్కూల్ లో చేరిన టీచర్ కు స్కాట్‌లాండ్ ప్రభుత్వం ఏడాదికి మన భారత్ కరెన్సీలో రూ. 2,29,146 ( 2,265 పౌండ్లు) చొప్పున జీతాన్ని పెంచుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్‌లో హెడ్ టీచర్‌తోపాటు లెర్నింగ్ సపోర్ట్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. టీచర్ క్లాసులు చెబితే.. విద్యార్థులు వాటిని చదివి, అర్థం చేసుకొనేలా చేయడం సపోర్ట్ అసిస్టెంట్ల బాధ్యత. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి అని అంటున్నారు. సుదూర ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులకు ఇది మంచి ఆఫర్. ఎందుకంటే అక్కడ పనిచేయాలని ఒత్తిడి చేయరు. భారీ జీతాలను, సదుపాయాలను కల్పించి.. ఆశలు రెకెత్తిస్తారు. ఓ వైపు మంచి జీతం.. మరోవైపు కనువిందు చేసే ప్రకృతి అందాలు.

ఈ ఎత్తైన కొండలాంటి దీవి సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది. దీంతో ఈ దీవికి వెళ్ళడానికి ఎవరైనా కొంచెం భయపడతారు. పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా ఉన్న ఈ దీవి అరుదైన పక్షులకు ఆవాసం. 27 రకాల పక్షులకు ఈ దీవి నివాసం.. దీంతో ఈ దీవి బాధ్యతలను స్కాట్‌లాండ్ నేషనల్ పార్క్‌కు అప్పగించారు. అయితే, ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి ఈ దీవి నచ్చేస్తుంది

Also Read: Prawn Egg Omelette: నాన్‌వెజ్ ప్రియులు రొటీన్ టిఫిన్స్‌తో విసిగిపోయారా.. అయితే వెరైటీగా రొయ్యల ఆమ్లెట్ ట్రై చేయండి