బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. అధ్యక్షుడికి పాజిటివ్..
కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ వైరస్ అక్క్డిడి ప్రజల్ని ఎవర్ని కూడా వదిలిపెట్టడం..
కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ వైరస్ అక్క్డిడి ప్రజల్ని ఎవర్ని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన వయస్సు 65 ఏళ్లు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం నాడు ఓ టీవీ షోలో జరుగుతున్న ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. కొన్ని కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ప్రస్తుతం అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను వాడుతున్నానన్నారు.
కాగా, శనివార నాడు ఆయన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. అందులో అతడు జూలై 4వ తేదీన అమెరికా రాయబారితో పాటు.. పలువురు మంత్రులతో కలిసి భోజనం చేశాడు. అయితే ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తున్న సమయంలో.. కనీసం సోషల్ డిస్టెన్స్ కానీ.. మాస్క్ కానీ ధరించలేదు. ఆయన కరోనా మహమ్మారిని తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అందులో రెండు సార్లు నెగెటివ్ వచ్చింది. తాజాగా మూడో సారి చేయించుకున్న సందర్భంగా కరోనా పాజిటివ్‌గా తేలింది.