క‌రోనా విల‌య‌తాండ‌వం.. తెలుగు రాష్ట్రాల్లో విప‌రీతంగా పెరుగుతోన్న‌ కేసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండవం...

క‌రోనా విల‌య‌తాండ‌వం.. తెలుగు రాష్ట్రాల్లో విప‌రీతంగా పెరుగుతోన్న‌ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 7:33 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 1178 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 1155 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 22 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో 13 కరోనా మరణాలు సంభవించాయి. కర్నూల్ జిల్లాలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 252కి చేరింది. అలాగే 11,200 యాక్టివ్ కేసులు ఉండగా.. 9,745 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల్లో 16,238 పరీక్షలు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 10,50,090కు చేరింది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 1,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య313కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 11,012 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 16,287 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.