Covid Vaccine: దేశంలో పెరుగుతున్న కొవిడ్ తీవ్రత.. వారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలంటోన్న బయోకాన్ చీఫ్..
Kiran Mazumdar Shaw: దేశంలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు
Kiran Mazumdar Shaw: దేశంలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మూడో వేవ్ ఆందోళనలను నిజం చేస్తూ ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈక్రమంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నారు. కాగా మనదేశంలో కూడా ప్రికాషన్ డోసుల పంపిణీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మొదట ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, సీనియర్ సిటిజన్లకు ఈ టీకా వేస్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి ఈ అదనపు డోసును పంపిణీ చేస్తున్నారు. కాగా కొద్ది రోజులుగా బూస్టర్ డోస్ పంపిణీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా. బూస్టర్ డోసులు తీసుకుంటున్న వారిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ ఆనవాళ్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చిన ఆమె ఈ టీకాల పంపిణీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
సంస్థలకు అనుమతులివ్వాలి..
ఈ సందర్భంగా కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలగకూడదంటే ఉద్యోగులు, సిబ్బందికి ఆయా కంపెనీలే ప్రికాషన్ డోసులు ఇవ్వాలని కిరణ్ సూచించారు. ‘ దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను నిరోధించేందుకు ఆయా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులు, సిబ్బందికి బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఈ మేరకు సంస్థలకు త్వరగా అనుమతులివ్వాలి. పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఉద్యోగుల విధులకు అంతరాయం కలుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధ పథంలో సాగాలంటే పారిశ్రామికాభివృద్ధి ఎంతో అవసరం’ అని అంటూ బయోకాన్ చీఫ్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భారత పరిశ్రమల సమాఖ్య (CII), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) లను ట్యాగ్ చేశారు.
With surging Positive cases I think all companies must be permitted to provide booster doses to its employees. There is massive work disruptions becos of folk testing positive. Keeping Industry moving is an essential need for the economy. @PMOIndia @FollowCII @ficci_india
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) January 16, 2022
Also Read: ఈ మేకకు చికెన్ బిర్యానీ, మటన్ లేకుంటే ముద్ద దిగదు.. వీడియో
Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో
Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో