లీటర్ రూ. 22కి పడిపోయిన ఇంధన ధరలు!

అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభంతో ఏటీఎఫ్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.64,323.76 నుంచి ఏకంగా రూ.22,544.75కి పడిపోయింది. పెట్రోల్‌తో పోలిస్తే ఏటీఎఫ్ ధర..

లీటర్ రూ. 22కి పడిపోయిన ఇంధన ధరలు!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 2:11 PM

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఇంధన ధరలు (ఏటీఎఫ్) 23 శాతానికి పైగా తగ్గాయి. అందులోనూ విమానాల్లో వాడే ఇంధన ధరలు మరింత కిందకి దిగజారిపోయాయి. కిలో లీటర్ (వెయ్యి లీటర్లు) ఏటీఎఫ్ ధర రూ.6,812.62 (232 శాతం) తగ్గి.. ప్రస్తుతం రూ.22,544.75కి చేరింది. అంతర్జాతీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలు తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు.

అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభంతో ఏటీఎఫ్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.64,323.76 నుంచి ఏకంగా రూ.22,544.75కి పడిపోయింది. పెట్రోల్‌తో పోలిస్తే ఏటీఎఫ్ ధర మూడో వంతుకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ధర రూ.69.59గా ఉండగా, లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 22.54గా ఉంది. కాగా ఇక తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీ పతనాన్ని చవి చూసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా గత కొద్ది కాలంగా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. దీంతో ఇంధన ధరలతో పాటు బంగారం డిమాండ్ కూడా తగ్గిపోతుంది.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!