గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. మినిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ..

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు 'కరోనా లోన్'
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 8:09 AM

గత కొంత కాలంగా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమవుతోంది. కరోనా కష్టాలు అందర్నీ కుదిపేస్తున్నాయి. దీని కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌తో వసల కూలీలు, నిరుపేదలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు, దినసరి కూలీలకు సంపాదన లేక పలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

దీంతో ఇప్పటికే ఆర్బీఐ వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం ప్రకటించింది. అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. అద్దె వసూలు చేయవద్దని ఇంటి యజమానులకు సూచించాయి. అటు పారిశ్రమిక వేత్తలకు, వ్యాపారస్తులకు రాబడి నిలిచిపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. మినిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ వ్యక్తిగత రుణం ఆఫర్ చేస్తున్నాయి. అందుకు 8-15 శాతం వరకూ వార్షిక వడ్డీ విధిస్తున్నాయి.

అయితే ఈ లోన్‌ ఎవరికి వర్తిస్తుందంటే.. 12 నెలలుగా తమ బ్యాంక్ ఖాతా నుంచి శాలరీ లేదా పెన్షన్ పొందుతున్న వారు, అలాగే గతంలో తీసుకున్న లోన్స్‌ (అప్పుల్ని) క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే కనుక మీరు ఈ లోన్‌కి అర్హులే. అంతేకాకుండా శాలరీ అకౌంట్ హోల్డర్లకూ ఈ ఆఫర్ వర్తించనుంది. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా 650 పాయింట్లు ఉంటే చాలంటున్నాయి బ్యాంకులు. 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమతితో ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మీరూ ఈ రూల్స్‌ని పాటిస్తూ ఉంటే.. పైన తెలిపిన సంబంధిత బ్యాంకులకు వెళ్లి ‘కోవిడ్-19’ లోన్ తీసుకోవచ్చు.

Read More:

ఏపీకి వచ్చే వారి కోసం సీఎం జగన్ న్యూ రూల్స్!

షాకింగ్ రిపోర్ట్.. కరోనా వైరస్ మరో రెండేళ్ల వరకూ ఉంటుందట!