AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Pfizer vaccine: నార్వేలో టీకా తీసుకున్న వృద్ధులు మృతి, ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా

నార్వే దేశంలో కొవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. టీకా మరణాలతో 10 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్‌ డోస్ లకు ఒప్పందం కుదుర్చుకున్న..

Coronavirus Pfizer vaccine: నార్వేలో టీకా తీసుకున్న వృద్ధులు మృతి, ఫైజర్ వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా
Surya Kala
|

Updated on: Jan 18, 2021 | 4:24 PM

Share

Coronavirus Pfizer vaccine: నార్వే దేశంలో కొవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. టీకా మరణాలతో 10 మిలియన్ల ఫైజర్ వ్యాక్సిన్‌ డోస్ లకు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రేలియాలో ఆందోళన నెలకొంది. టీకా విషయంపై ఆస్ట్రేలియా అధికారులు.. నార్వే ప్రభుత్వాన్ని అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ మెల్‌బోర్న్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ను తయారు చేసిన కంపెనీతో పాటు నార్వేజియన్ మెడికల్ రెగ్యులేటర్ నుంచి ఫైజర్ వ్యాక్సిన్‌ పై అదనపు సమాచారాన్ని కోరుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ నార్వే ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టిందని తెలిపారు.

నార్వే దేశంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్తితులు టీకాలు ఆరోగ్యవంతులకు, యువకులకు వేయకుండా ఉండాలని అర్ధంకాదని.. ఈ సంఘటనను ఒక అనుభవంగా తీసుకోవాలని సూచించారు. అయితే వ్యాక్సినేషన్ ఇచ్చే ముందు భద్రతా పర్యవేక్షణ ఎంత అవసరమో తెలియజేస్తుందని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కొత్త అధ్యక్షుడు ఎమెర్ కుక్ స్పందిస్తూ.. కోవిడ్ నివారణకు టీకా వేసే సమయంలో భద్రత ఎంతముఖ్యమో తెలియజేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఎ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ఒక ఛాలెంజ్ అని చెప్పారు.

నార్వే దేశంలో రెండు రోజుల క్రితం కరోనా టీకాలు వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారు. కరోనా టీకాలు వేయించుకున్న 23 మంది అనారోగ్యానికి గురై మరణించడంతో నార్వే అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.80 ఏళ్ల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తే వారిలో ప్రతికూల చర్యలు కనిపించాయని వైద్యులు చెప్పారు. 23 మంది వృద్ధులు కరోనా టీకా వేయించుకున్న కొద్దిసేపటికే మరణించారని, దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా తేలలేదని, మరణించిన 23 మందిలో 13 మంది విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. మరోవైపు నార్వేలో టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు.

Also Read: ఎలక్షన్స్ ప్రకటించకుండానే హీట్ ఎక్కుతున్న పశ్చిమబెంగాల్, త్వరలో కోల్‌కతాలో కలుద్దామన్న శివసేన

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!