Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న కరోనా ఉధృతి.. ఒక్కరోజులో 22 వేలకు పైగా కేసులు..
Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మాదిరిగానే శుక్రవారం కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో...
Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మాదిరిగానే శుక్రవారం కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదయ్యాయి. ఈ విషయమై తాజాగా ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 89,097 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇక శుక్రవారం కూడా రాష్ట్రంలో మరణాలు ఎక్కువ సంఖ్యలోనే సంభవించాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ 19 కారణంగా 96 మంది మరణించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 13,88,803 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఇప్పటివరకు 11,75,843 మంది కరోను నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.. ఇక కరోనా కారణంగా 9,713 మంది మరణించారు. ప్రస్తుతం 2,03,787 మంది చికిత్స పొందతున్నారు. ఇక జిల్లాల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 2213 కేసులు, చిత్తూరులో 2708, గుంటూరు 1733, ప్రకాశం 1265, వైఎస్ఆర్ కడప 1460, విశాఖపట్నం 2200, శ్రీకాకుళం 695, ప్రకాశం 1265, నెల్లూరు 1733, క్రిష్ణ 1031 మంది కరోనా బారిన పడ్డారు.
COVID 19 Vaccination: భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !