Indian Railways: కరోనా ఎఫెక్ట్… ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం… 31 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

దేశంలో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ అందించింది. మే 12 నుంచి మరో 31 రైళ్లను రద్దు చేసింది.

Indian Railways:  కరోనా ఎఫెక్ట్... ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం... 31 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
Trains
Rajitha Chanti

|

May 14, 2021 | 2:22 PM

దేశంలో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ అందించింది. మే 12 నుంచి మరో 31 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లు పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు బీహార్ మధ్య మార్గాల్లో నడిచేవి. ప్రస్తుతం పరిస్థితులలో నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు పేరొంటలైజేషన్ కారణంగా 18 సర్వీసులను నిలిపివేస్తామని ఈశాన్య సరిహద్దు రైల్వే ఓ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే హౌరా డివిజన్ లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా మరో 13 రైళ్లను రద్దు చేశాయి.

ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో అన్ని ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. ఐఆర్సిటీసీ నేతృత్వంలోని జాతీయ రవాణాదారులు గత సంవత్సరం నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మే 12 నుంచి మొత్తం 31 రైళ్లు రద్దు చేసింది. కొన్ని రైళ్లు మే 13, 14, 15 నుంచి రద్దు చేస్తుంది.

రద్దు చేసిన రైళ్ల జాబితా..

➦ 05467: సిలిగురి- బామన్హాట్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 13 నుంచి రద్దు ) ➦ 05468: బామన్హాట్-సిలిగురి జంక్షన్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05811: ధుబ్రి- గౌహతి ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 13 నుంచి రద్దు) ➦ 05812: గౌహతి-దుబ్రీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05767: సిలిగురి జెఎన్- అలీపూర్దుర్ జంక్షన్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05768: అలీపూర్దుర్ జంక్షన్ – సిలిగురి జంక్షన్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 13 నుంచి రద్దు) ➦ 05719: కతిహార్- సిలిగురి జంక్షన్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05720: సిలిగురి జంక్షన్ – కతిహార్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 13 నుంచి రద్దు) ➦ 05749: న్యూ జల్పాయిగురి- హల్దిబారి ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05750: హల్దిబారి – న్యూ జల్పాయిగురి ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05751: న్యూ జల్పాయిగురి – హల్దిబారి – ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05752: హల్దిబారి – న్యూ జల్పాయిగురి ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ (మే 12నుంచి రద్దు ) ➦ 05815: గువహతి- డెకర్గావ్ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12నుంచి రద్దు) ➦ 05816: డెకర్గావ్ – గౌహతి ఇంటర్ సిటీ స్పెషల్ (మే 12 నుంచి రద్దు) ➦ 07541: సిలిగురి- ధుబ్రీ ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 07542: ధుబ్రి – సిలిగురి ఇంటర్ సిటీ స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 07525: సిలిగురి- న్యూ బొంగాగావ్ డెము స్పెషల్ (మే 12 నుంచి రద్దు) ➦ 07526: న్యూ బొంగాగావ్ – సిలిగురి డెమో స్పెషల్ ట్రైన్ (మే 12 నుంచి రద్దు) ➦ 05959: హౌరా జంక్షన్ – దిబుగ్రహ్ టౌన్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (మే 16 న జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 05960: దిబుగ్రహ్ టౌన్- హౌరా జంక్షన్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 14 , మే 15 న జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 05961: హౌరా జంక్షన్ – దిబుగ్రహ్ టౌన్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (జర్నీ మే 17 న ప్రారంభమవుతుంది) ➦ 03033: హౌరా జెఎన్ – కతిహార్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (జర్నీ మే 13 నుండి మే 17 వరకు ప్రారంభమవుతుంది) ➦ 03034: కతిహార్ – హౌరా జెఎన్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 14 నుండి మే 18 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03141: సీల్దా- న్యూ అలీపూర్దుర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 13 నుండి 17 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03142: న్యూ అలీపూర్దుర్- సీల్దా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 14 నుండి 18 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03163: సీల్దా- సహర్సా జంక్షన్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ (మే 14 నుండి 17 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03164: సహర్సా జంక్షన్ – సీల్దా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (జర్నీ మే 14 నుండి 17 వరకు ప్రారంభమవుతుంది) ➦ 03145: కోల్‌కతా- రాధికపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (మే 14 నుంచి 17 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03146: రాధికపూర్ – కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (మే 15 నుంచి మే 18 వరకు జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03063: హౌరా- బలూర్ఘాట్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (మే 13, మే 14, మే 17 మరియు మే 21 న జర్నీ ప్రారంభమవుతుంది) ➦ 03064: బలూర్ఘాట్ – హౌరా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (మే 13, మే 14, మే 17 మరియు మే 21 న జర్నీ ప్రారంభమవుతుంది)

Also Read: చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..

కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu