పెరుగుతోన్న పెట్రోల్ ధరలు.. వైరల్ అవుతోన్న బిగ్‌బీ ట్వీట్..

గత 18 రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.10 వరకూ పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. అందులోనూ ఈసారి పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు..

  • Tv9 Telugu
  • Publish Date - 7:47 pm, Thu, 25 June 20
పెరుగుతోన్న పెట్రోల్ ధరలు.. వైరల్ అవుతోన్న బిగ్‌బీ ట్వీట్..

గత 18 రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జూన్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.10 వరకూ పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. అందులోనూ ఈసారి పెట్రోల్ కంటే డీజిల్ ధరే ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు.. ఈ చమురు ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ఇదే విధంగా 2012లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో 8 రూపాయలు పెరిగిన పెట్రోల్ ధరలపై రగులుతున్న జనాలు తమ కార్లను ఎలా తగల పెట్టాలనుకుంటున్నారో చెబుతూ.. బిగ్‌బీ చేసిన విమర్శలు ఇప్పటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి.

అమితాబ్ ట్వీట్ ప్రకారం.. ‘పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లిన ఓ ముంబై వాసిని బంకులో పనిచేసే వ్యక్తి.. ‘ఎంత పొయ్యమంటారు సార్’ అని అడుగుతాడు. దానికి అతడు బదులిస్తూ.. రెండు లేదా మూడు రూపాయల పెట్రోల్ కారు మీద పొయ్యి బ్రదర్ తగలబెట్టేస్తాను’ అని అంటాడు. వినడానికి ఇది సరదాగా ఉన్నా.. అప్పటి పెట్రోల్ ధరలకి ఆ వ్యాఖ్యలు అద్దం పట్టేలా ఉన్నాయి. కాగా ఇప్పుడు సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత తాజాగా ఈ పోస్టుపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ రోజు పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగాయి. పెరిగిన రేట్లతో లీటర్ పెట్రోల్ రూ.82.96, డీజిల్‌ రూ.78.19గా ఉంది.

Read More: 

పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయి?

పాడైన కరెన్సీ నోట్లను.. ఫ్రీగా ఎస్‌బీఐ‌లో మార్చుకోండిలా..

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..