పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయి?

మీరు మీ పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం లేదా? అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్న సంగతే మరిచారా? మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అన్న డౌట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈపీఎఫ్‌‌ని...

పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోకపోతే ఏమవుతాయి?
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 6:49 PM

మీరు మీ పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం లేదా? అసలు పీఎఫ్ అకౌంట్ ఉన్న సంగతే మరిచారా? మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? అన్న డౌట్ సాధారణంగా అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈపీఎఫ్‌‌ని అందరూ చెక్ చేసుకుంటున్నారు. కానీ గతంలో ఇలా ఉండేది కాదు. చాలా మంది ఎంప్లాయీస్ ఉద్యోగం మానేసిన తరువాత అసలు తమ ఈపీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు. అందులో డబ్బులు ఉన్నాయన్న సంగతి కూడా గుర్తుండదు. అదంతా పెద్ద తతంగం అని భయపడ్డవారు కూడా ఉన్నారు. ఇదే విషయం పలు నివేదికల్లో తేలింది.

ఉద్యోగులు మారినప్పుడల్లా వారి పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కు పీఎఫ్ డబ్బులను ట్రాన్స్ ఫర్ చేయొచ్చన్న విషయం కూడా తెలియదు. దీంతో పాత అకౌంట్‌లోనే డబ్బులు ఉండిపోతాయి. తమకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడంతో.. అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత కూడా ఆ డబ్బులు వారి అకౌంట్లలోనే ఉండిపోయేవి.

మరి ఇలా క్లెయిమ్ కానీ పీఎఫ్ డబ్బులు ఎక్కడికి పోతాయంటే.. ఈపీఎఫ్ అకౌంట్లలో క్లెయిమ్ చేసుకోని డబ్బుల మొత్తాన్ని ‘సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌’కు తరలిస్తూంటారు. ఇలా 2015 నాటి లెక్కల ప్రకారం దాదాపు రూ.6 వేల కోట్లు ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో క్లెయిమ్ కాని ఈ డబ్బును తిరిగి ప్రజలకే ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ‘సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్’‌ను తీసుకొచ్చింది. కాగా పీఎఫ్ అకౌంట్‌లో దాదాపు 36 నెలల పాటు డబ్బులు జమ కాకపోయినా.. విత్ డ్రా చేయకపోయినా ఆ అకౌంట్‌ను ఇనాపరేటీవ్‌గా భావిస్తారు.

Read More: 

పాడైన కరెన్సీ నోట్లను.. ఫ్రీగా ఎస్‌బీఐ‌లో మార్చుకోండిలా..

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..