ఎరుపు రంగు చీరలో రెడ్ రోస్‌లా.. సమంత బ్యూటిపుల్ ఫొటోస్!
Samatha
30 May 2026
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
సమంత
ఈ బ్యూటీ 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఏమాయ చేశావే మూవీ
ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది. దీంతో తెలుగు, తమిళ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది.
స్టార్ హీరోయిన్
ఇక తర్వాత వరసగా దూకుడు, ఈగ , అత్తవారింటికి దారేది వంటి సినిమాల్లో నటించింది, స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
వరస సినిమాలు
అయితే ఈ బ్యూటీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ పలు కారణాల వలన వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
లవ్ మ్యారేజ్
తర్వాత 2022లో ఈ బ్యూటీ మయోసైటీస్ వ్యాధితో బాధపడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
మయోసైటీస్
ఈ ముద్దుగుమ్మ త్వరలో మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షలకు ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత ఈ చిన్నది థియేటర్లో సందడి చేయనుంది.
మా ఇంటి బంగారం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, రెడ్ కలర్ చీరలో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది.