AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు అబ్బాస్ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సీఎం విజయ్ ప్రాణ స్నేహితుడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో..

ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 90's లవర్ బాయ్ అబ్బాస్ పక్కన ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆ కుర్రాడు ఇప్పుడు క్రేజీ హీరో. అంతేకాదు సీఎం విజయ్ దళపతి ప్రాణ స్నేహితుడు కూడా. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? అయితే ఇప్పుడు అతడు ఎవరో తెలుసుకుందాం.

Tollywood : అప్పుడు అబ్బాస్ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సీఎం విజయ్ ప్రాణ స్నేహితుడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో..
Jai, Abbas
Rajitha Chanti
|

Updated on: May 30, 2026 | 4:29 PM

Share

సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అభిమానులు కూడా తమ ప్రియమైన హీరోలు, హీరోయిన్ల చైల్డ్‌హుడ్ పిక్స్ చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. తాజాగా నెట్టింట ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో టాలీవుడ్, కోలీవుడ్ అలనాటి లవర్ బాయ్ అబ్బాస్ పక్కన ఒక చిన్న పిల్లాడు ఎంతో ముద్దుగా కూర్చుని ఉన్నాడు. అప్పట్లో అబ్బాస్ అంటే పడిచచ్చే ఆ బుడతడు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ దళపతి ప్రాణ స్నేహితుడు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ తరుపున జోరుగా ప్రచారం చేశారు. అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. విజయ్ గెలుపులో తనవంతూ కృష్టి చేశారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా?

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఆ అబ్బాయి మరెవరో కాదు.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన హీరో ‘జై’. శర్వానంద్, అంజలిలతో కలిసి నటించిన ‘జర్నీ’ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘రాజా రాణి’ వంటి వైవిధ్యమైన సినిమాలతో లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నిజానికి జై తమిళంలో క్రేజీ హీరో. అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కొన్ని నెలల క్రితం హీరో జై స్వయంగా ఈ అరుదైన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. “నా ఆల్-టైమ్ ఫేవరెట్ హీరో” అంటూ అబ్బాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఈ పిక్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు అబ్బాస్ సైతం స్పందించి రిప్లై ఇవ్వడంతో ఈ పిక్ కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అయింది. ఏదో సినిమా ఫంక్షన్ లేదా ఈవెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఫోటో తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ప్రేమదేశం సినిమాతో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన అబ్బాస్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. మరోవైపు, జై కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి ‘అన్నపూరణి’ చిత్రంలో నటించిన జై, ఈ ఏడాది ‘బేబీ అండ్ బేబీ’ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘కరుప్పర్ నగరం’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల కూడా జై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ చైల్డ్‌హుడ్ ఫోటో చూసిన నెటిజన్లు.. “జర్నీ హీరో జై చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో!” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

హీరో జై పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us