బాబోయ్.. ఘాటు మిర్చీలా రెడ్ సారీలో చిట్టీ.. ఈ అందాలను తట్టుకోవడం కష్టమే..
Samatha
30 May 2026
టాలీవుడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
ఫరియా అబ్దుల్లా
మే 28, 1998న హైదరాబాద్‌లో జన్మించిన ఈ అందాల ముద్దుగుమ్మ, 2021లో నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
జాతి రత్నాలు మూవీ
ఈ మూవీలో చిట్టీ పాత్రలో నటించి, ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాకుండా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
చిట్టీ పాత్ర
ఈ మూవీలో ఓ అమాయకపు లాయర్ పాత్రలో నటించి, అందరినీ నవ్వించడమే కాకుండా, తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు తిప్పుకుంది.
అమాయకపు లాయర్‌లా
ఇక ఈ మూవీ తర్వాత ఈబ్యూటీ లైఫ్ టర్న్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడుకు అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.
లక్కు
తర్వాత ఈ బ్యూటీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రల్లోనే నటించింది. అంతే కాకుండా హీరోయిన్గా చేసినవి కూడా అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
సెకండ్ హీరోయిన్ పాత్రలు
దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు తగ్గాయి. అందం, అభినయం ఉన్నా కూడా ఈ అమ్మడుకు అంతగా ఛాన్స్‌లు రావడం లేదంట.
తగ్గిన అవకాశాలు
ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా, ఈ చిన్నది మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో ఆగం చేస్తుంది, ప్రస్తుతం రెడ్ సారీలో మతి పొగుడుతుంది.