Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే రోజులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి : యునిసెఫ్ నివేదిక

రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత పెరుగతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే పన్నెండు నెలల్లో ఐదు నుంచి అంతకంటే తక్కువ వయసు కలిగిన 8,81,000 మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో చనిపోతారని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక హెచ్చరించింది

రాబోయే రోజులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి : యునిసెఫ్ నివేదిక
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 25, 2020 | 8:06 PM

రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత పెరుగతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరో వారంలో కరోనా కేసులు 10 మిలియన్ మార్క్ ను దాటే అవకాశముందని డబ్ల్యూ హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందన్నారు   డబ్ల్యూహెచ్ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్.  పరిస్థితులు అదుపులోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. రాబోయే రోజుల్లో వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందన్నారు. కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ.. సాధారణ స్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని వెల్లడించింది. అప్పటి వరకు ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు డబ్ల్యూహెచ్ ఓ జనరల్ డైరెక్టర్  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం కొవిడ్ మహమ్మారి దక్షిణ ఆసియాలోని లక్షలాది మంది పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వివరించింది.

ఈ నివేదిక ప్రకారం వచ్చే పన్నెండు నెలల్లో ఐదు నుంచి అంతకంటే తక్కువ వయసు కలిగిన 8,81,000 మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో చనిపోతారని నివేదిక హెచ్చరించింది. ఈ మరణాలలో ఎక్కువ భాగం భారతదేశం, పాకిస్తాన్ దేశాల్లోనే సంభవించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దక్షిణాసియా దేశాల్లోని చిన్న పిల్లలు మీజిల్స్, న్యుమోనియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా తీవ్ర పేదరికంలో నివసిస్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని యునిసెఫ్ నివేదిక అంచనా వేసింది. వచ్చే ఆరు నెలల్లో ఈ మహమ్మారి అదనంగా 120 మిలియన్ల మంది పిల్లలను దారిద్య్రరేఖకు దిగువకు చేరుస్సతుందని సూచిస్తుంది. 2016 నాటి లెక్కల ప్రకారం.. దక్షిణాసియాలోని ఎనిమిది దేశాలలో 240 మిలియన్ల మంది పిల్లలు కడు పేదరికంలో జీవిస్తున్నారని.. వీరిలో 155 మిలియన్లకు పైగా భారతదేశంలోనే నివసిస్తున్నట్లు గుర్తించారు.

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావంతో ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వైద్యసదుపాయాలతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యాల బారినపడ్డ పేద,అట్టడుగు వర్గాలకు చెందిన చాలా మంది పిల్లలు అవసరమైన చికిత్సకు దూరమయ్యారు. అయా దేశాల్లో లాక్ డౌన్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యిందని నివేదిక తెలిపింది. కరోనావైరస్ కలిగిస్తున్న దుష్ప్రభావాలు అనేక విధాలుగా పిల్లలకు హాని కలిగిస్తున్నాయని దక్షిణ ఆసియా యునిసెఫ్ ప్రాంతీయ డైరెక్టర్ జీన్ గోఫ్ అన్నారు.

జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనలో మరిన్ని ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. కరోనా కలిగించే అనార్ధాలతో గర్భస్థ శిశువులతో పాటు తల్లులు కూడా చనిపోతారని అంచనా వేసింది. దాదాపు 36,000 మంది తల్లులు చనిపోతారని అధ్యయనం తెలిపింది. జనాభా సాంద్రతతో పాటు పేలవమైన ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థల కారణంగా భారత్ తోపాటు పాకిస్తాన్ లో ఎక్కువ మంది తల్లుల మరణాలు కనిపిస్తాయని వెల్లడించింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా మరణాల రేటు గణనీయంగా పెరిగాయని వివరించింది.

కరోనా ప్రభావంతో లౌక్ డౌన్ కారణంగా భారీగా ఉద్యోగాలు కోల్పోవడం మరియు ఆదాయాలు తగ్గడంతో.. పేద కుటుంబాలు తమ పిల్లలకు కనీసం పోషకాహారాన్ని కూడా అందించలేకపోతున్నాయని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. ఆహార ధరలు పెరగడం, రవాణా సంబంధాలు, మార్కెట్లకు అంతరాయం కలిగించడంతో, అట్టడుగు పేద ప్రజలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆహార భద్రత ముప్పు వాటిల్లుతుందని నివేదిక వెల్లడించింది. భారతదేశంలో మాత్రం మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ భోజన కార్యక్రమాలపై ఆధారపడి పెద్ద సంఖ్యలో పిల్లలు తమ కడుపునింపుకుంటారని ఈ నివేదిక వివరించింది. మిగతా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని నివేదిక వివరించింది.