స్విస్ బ్యాంకులో తగ్గుతున్న భారతీయుల డిపాజిట్లు

తమ బ్యాంక్‌లో భారతీయుల డిపాజిట్లు తగ్గాయని ప్రముఖ స్విట్జర్లాండ్ బ్యాంక్ వెల్లడించింది. 2019లో భారతీయులు, భారతీయ సంస్థల డిపాజిట్లు ఆరు శాతం తగ్గాయని స్విస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ క్రమంలో గతేడాది భారతీయుల డిపాజిట్లు రూ.6,625కోట్లకు పరిమితం అయ్యాయని తెలిపింది. ఇలా జరగడం వరుసగా ఇది రెండో సంవత్సరమని స్విస్ బ్యాంక్ పేర్కొంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన వారి డిపాజిట్లు కూడా తగ్గగా.. అమెరికా, బ్రిటన్ వాటా పెరిగినట్లు స్విస్ బ్యాంక్ తెలిపింది. అయితే […]

స్విస్ బ్యాంకులో తగ్గుతున్న భారతీయుల డిపాజిట్లు
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 8:14 PM

తమ బ్యాంక్‌లో భారతీయుల డిపాజిట్లు తగ్గాయని ప్రముఖ స్విట్జర్లాండ్ బ్యాంక్ వెల్లడించింది. 2019లో భారతీయులు, భారతీయ సంస్థల డిపాజిట్లు ఆరు శాతం తగ్గాయని స్విస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ క్రమంలో గతేడాది భారతీయుల డిపాజిట్లు రూ.6,625కోట్లకు పరిమితం అయ్యాయని తెలిపింది. ఇలా జరగడం వరుసగా ఇది రెండో సంవత్సరమని స్విస్ బ్యాంక్ పేర్కొంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన వారి డిపాజిట్లు కూడా తగ్గగా.. అమెరికా, బ్రిటన్ వాటా పెరిగినట్లు స్విస్ బ్యాంక్ తెలిపింది. అయితే నల్లధనంపై యుద్ధం చేస్తున్న భారత ప్రభుత్వం స్విస్ ఖాతాల వివరాలు అందజేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆ బ్యాంకు భారతీయుల ఖాతాల వివరాలను పలుమార్లు ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనాతో చనిపోయిన ఫేమస్‌ ‘పానీ పూరీ’ అంకుల్.. ముంబయి వాసుల గొప్ప నిర్ణయం