లాక్‌డౌన్‌లో కెమెరా ముందుకొచ్చిన మొదటి నటుడు.. అసలు విషయం ఇదే!
లాక్‌డౌన్ నేపథ్యంలో కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడిగా అక్షయ్ కుమార్ నిలిచారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి లాక్‌డౌన్ తర్వాత నిర్వర్తించాల్సిన బాధ్యతలపై.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..

లాక్‌డౌన్ నేపథ్యంలో కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడిగా అక్షయ్ కుమార్ నిలిచారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి లాక్‌డౌన్ తర్వాత నిర్వర్తించాల్సిన బాధ్యతలపై.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ యాడ్‌ను రూపొందించారు. ప్రముఖ డైరెక్టర్ బాల్కీ పర్యవేక్షణలో ఈ యాడ్‌ని చిత్రీకరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోసం దీన్ని షూట్ చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. ఇందులో పాల్గొన్న కొద్దిమంది సిబ్బంది మాస్కులు ధరించి, తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎక్కువ భద్రతతో.. తక్కువ మందితో చిత్రీకరణ చేసేందుకు నిర్మాత అనిల్ నాయుడు సహకరించారని డైరెక్టర్ బాల్కీ తెలిపారు. తగిన ఆరోగ్య భద్రతలతో చిత్రీకరణ జరిపాం. భౌతిక దూరం, పరిశుభ్రమైన సెట్, క్రిమిసంహారక స్క్రీన్, ముఖానికి మాస్క్‌లతో అధికారుల ఆదేశాలను పాటిస్తూ షూటింగ్ చేశామన్నారు. ఈ షూటింగ్‌కి పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. విలువైన సందేశాన్ని ప్రజలకు చేరే ప్రయత్నాన్ని చేశామని దర్శకుడు బాల్కీ వెల్లడించారు. కాగా డైరెక్టర్ బాల్కీ ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్ మ్యాన్, మిషన్ మంగల్’ సినిమాలకు దర్శకత్వం వహించారు.
Read More:
రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..
ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..
మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్
బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!




