ఏపీలో ప్లాస్మా థెరపీకి అనుమతి

కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరించి..అర్హులైన కోవిడ్ పేషెంట్లకు ఎక్కించి చికిత్స అందిస్తారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తుండగా..

ఏపీలో ప్లాస్మా థెరపీకి అనుమతి
Follow us

|

Updated on: May 26, 2020 | 4:51 PM

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై యుద్ధానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్లాస్మా థెరపీని అస్త్రంగా వాడుతున్నాయి. ఈ మేరకు ఐసీఎమ్ఆర్ అనుమతి ఇచ్చిన ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ విధానంతో చికిత్స అందిస్తున్నారు. ప్లాస్మా విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాజాగా ఏపీలోని మరో ఆస్పత్రిలో  ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్లాస్మా థెరపీతో మెరుగైన ఫలితాలు రావడంతో ఏపీలోనూ ఈ చికిత్స అందుబాటులోకి వచ్చింది.. తిరుపతి స్వీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ నిర్వహించేందుకు ఐసీఎమ్‌ఆర్ అనుమతి ఇచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరించి..అర్హులైన కోవిడ్ పేషెంట్లకు ఎక్కించి చికిత్స అందిస్తారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తుండగా..స్విమ్స్‌లో అవసరమైన ఇద్దరికి త్వరలో ప్లాస్మా చికిత్స అందించనున్నారు. అయితే, సాధారణంగా ఒక వ్యక్తి నుంచి 250 మి.లీ ప్లాస్మా తీసుకుంటామని..అది ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. క్రిటికల్ కండీషన్‌లో ఉన్న వ్యక్తికి ఒకసారి ప్లాస్మా ఎక్కిస్తే చాలు అది 10 నుంచి 15 రోజుల వరకు శరీంలో ఉంటుందని చెప్పారు. వేరే డోనర్ నుంచి తీసుకున్నది రోగికి ఇచ్చామంటే 10 నుంచి 15 రోజుల వరకు పని చేస్తుందని చెబుతున్నారు. అంతలోపు పేషెంట్ స్వతాగా యాంటి బయోటిక్ తయారు చేసుకుంటాడని అంటున్నారు.