గోవా వచ్చేవారి పట్ల కఠిన నిబంధనలు – సీఎం ప్రమోద్‌ సావంత్‌

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. గోవాలోని కరోనా పేషెంట్లలో 90 శాతం మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనన్నారు. ఇకపై అక్కడి నుంచి వచ్చే వారికి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు సావంత్. కాగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ముంబై […]

గోవా వచ్చేవారి పట్ల కఠిన నిబంధనలు - సీఎం ప్రమోద్‌ సావంత్‌
Follow us

|

Updated on: May 26, 2020 | 5:04 PM

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో ప్రవేశించే వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. గోవాలోని కరోనా పేషెంట్లలో 90 శాతం మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనన్నారు. ఇకపై అక్కడి నుంచి వచ్చే వారికి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు సావంత్. కాగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ముంబై నుంచి గోవాకు వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 67కు చేరుకుంది. ఇక సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ గోవా ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి అక్కడ రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోవా మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రాష్ట్రంలో ఆపకూడదని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ నిర్ణయించారు. తాజా పరిణాలమాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రైళ్లు, రోడ్డు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలో ప్రయాణిస్తున్న వారి వల్ల కేసులు పెరుగుతున్నాయని.. ఇకపై నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన అవసరముందన్నారు గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్‌ రాణే. గోవాలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలు జారీ చేశారు.