గుడ్ న్యూస్… డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో…

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు యూనివర్సిటీలు షెడ్యూల్ రిలీజ్ చేశాయి. స్టూడెంట్స్ నష్టపోకుండా ఉండేందుకు నిర్వహణ సంస్థలు టెక్నాలజీ‌ వినియోగించనున్నాయి. కొన్ని ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ జరుగనున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించే అక‌డ‌మిక్ ఎగ్జామ్స్ ను విద్యార్థులు ఈజీగా రాసేలా నూతన విధానాలు ఉండనున్నాయి. గతంలో మూడు గంటల పాటు నిర్వహించే ఎగ్జామ్స్ ఈ సారి రెండు […]

గుడ్ న్యూస్...  డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో...
Follow us

|

Updated on: May 26, 2020 | 6:36 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు యూనివర్సిటీలు షెడ్యూల్ రిలీజ్ చేశాయి. స్టూడెంట్స్ నష్టపోకుండా ఉండేందుకు నిర్వహణ సంస్థలు టెక్నాలజీ‌ వినియోగించనున్నాయి. కొన్ని ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌ పద్ధతిలోనూ జరుగనున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించే అక‌డ‌మిక్ ఎగ్జామ్స్ ను విద్యార్థులు ఈజీగా రాసేలా నూతన విధానాలు ఉండనున్నాయి. గతంలో మూడు గంటల పాటు నిర్వహించే ఎగ్జామ్స్ ఈ సారి రెండు గంటలు నిర్వహించేందుకు ఆమోదించారు. క్వ‌చ్చ‌న్ పేప‌ర్స్ లో చాయిస్‌ను పెంచనున్నారు.

జూన్‌ 20 నుంచి బీటెక్ ఎగ్జామ్స్…..

జేఎన్టీయూహెచ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జరిగే ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ వచ్చే నెల 20వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ రిలీజైంది. గతంలో పార్ట్‌-1, పార్ట్‌-2లో ప్రశ్నలు ఉండేవి. పార్ట్‌-1లో చాయిస్ ఆప్ష‌న్ ఉండదు. పార్ట్‌-2లో మాత్రమే చాయిస్‌ ఉండేది. ఇప్పుడు అన్నింట్లో చాయిస్‌ ఉండేలా క్వ‌చ్చ‌న్ పేప‌ర్స్ రూపొందించారు. ఒక్కో ఎగ్జామ్ 2 గంటల వ్యవధిలో పూర్తి కానుంది. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు ఈ నెల 31 వరకు ఛాన్స్ ఉంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే డిగ్రీ ఎగ్జామ్స్ సెమిస్టర్ ప‌ద్దతిలో జరుగనున్నాయి. 1,3,5 సెమిస్టర్‌ పరీక్షలు ఒక రోజు…. 2, 4, 6వ సెమిస్టర్ ఎగ్జామ్స్ మరుసటి రోజు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగనున్నాయి. డిగ్రీ ఎగ్జామ్స్ కు సైతం 2 గంటల సమయం కేటాయించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్‌ 10వ తేదీ వరకు తుది అవ‌కాశం ఉంది.

ఉత్తీర్ణత అయ్యే వారి సంఖ్య ఎక్కువ..

కొవిడ్‌-19 సంక్షోభ‌ పరిస్థితుల్లో స్టూడెంట్స్ నష్టపోకుండా ఉండేందుకు ఎగ్జామ్స్ సులభమైన రీతిలో పూర్తి చేయనున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో సైతం పరీక్షల సమయం తగ్గించి, చాయిస్‌ కల్పించినట్లు విద్యా నిపుణులు వెల్ల‌డించారు. రెండు, మూడు ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాసేలా చాయిస్‌ కల్పిస్తూ క్వ‌చ్చ‌న్ పేప‌ర్ ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలతో ఎక్కువ మంది విద్యార్థులు పాస‌య్యే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్‌ వైవా..

ఇంజినీరింగ్‌ కోర్సు ఫైన‌ల్ ఇయ‌ర్ లో ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నామినేట్‌ చేసిన లెక్చ‌ల‌ర్స్ ప్రాజెక్ట్‌ పనితీరు, స్టూడెంట్ సామర్థ్యాల ఆధారంగా మార్కులు, గ్రేడ్‌లు కేటాయిస్తారు. ఈ సంవత్సరం ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా ఆన్‌లైన్‌లో వైవా నిర్వహించేలా జేఎన్టీయూహెచ్‌ షెడ్యూల్‌ ఇచ్చింది.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు